తెలంగాణ

telangana

ETV Bharat / state

special commissioner: జంటనగరాల్లోని చెరువుల పరిరక్షణ కోసం ప్రత్యేక కమిషనర్​

జీహెచ్​ఎంసీ పరిధిలో ఉన్న చెరువుల నిర్వహణ అస్తవ్యస్తంగా మారిందని.. వీటన్నింటి పర్యవేక్షణ కోసం ప్రత్యేక కమిషనర్​ను నియమిస్తున్నట్లు రాష్ట్ర సర్కారు ప్రకటించింది. జంటనగరాల్లోని చెరువుల పరిరక్షణ, వాటి పునరుజ్జీవం కోసం నూతన కమిషనర్​ చర్యలు తీసుకుంటారని పేర్కొంది.

special commissioner: జంటనగరాల్లోని చెరువుల పరిరక్షణ కోసం ప్రత్యేక కమిషనర్​
special commissioner: జంటనగరాల్లోని చెరువుల పరిరక్షణ కోసం ప్రత్యేక కమిషనర్​

By

Published : Oct 4, 2021, 6:58 PM IST

జంటనగరాల్లోని చెరువుల పరిరక్షణ, వాటి పునరుజ్జీవం కోసం ఒక ప్రత్యేక కమిషనర్​(special commissioner for lakes)ను నియమిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్న మొత్తం 185 చెరువుల ఆక్రమణల కారణంగా వాటి నిర్వహణ అస్తవ్యస్తంగా మారిందని.. వీటన్నింటి పర్యవేక్షణ ఇకపై నూతన కమిషనర్ తీసుకుంటారని ప్రభుత్వం పేర్కొంది. జీహెచ్ఎంసీ యాక్ట్(ghmc act) ప్రకారం నియమితులైన ఈ స్పెషల్ ఆఫీసర్ పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ పర్యవేక్షణలో పనిచేయాల్సి ఉంటుందని ప్రభుత్వం పేర్కొంది. ఈ ప్రత్యేక కమిషనర్ చెరువుల పరిరక్షణతో పాటు.. వాటి సుందరీకరణ, నిర్వహణపై చర్యలు తీసుకుంటారని ప్రభుత్వం పేర్కొంది.

ఇందుకోసం జీహెచ్ఎంసీ(ghmc), హెచ్ఎండీ ప్రభుత్వ విభాగాలతో పాటు.. కార్పొరేట్లను కలుపుకొని సామాజిక బాధ్యత కింద చెరువుల అభివృద్ధి​ ప్రాజెక్టులో భాగస్వాములుగా చేయాలని సూచించింది. నూతన కమిషనర్ నియామకం నుంచే హుస్సేన్ సాగర్, వాటర్ బాడీ మేనేజ్​మెంట్ కమిషనర్ పరిధిలో పనిచేస్తుందని తెలిపింది. ఈ నూతన కమిషనర్ స్ట్రాటజిక్ నాలా డెవలప్ మెంట్ కమిషనర్​తో కలిసి పనిచేస్తూనే ఓఆర్ఆర్ పరిధిలోని నీటి నిల్వలపైనా పనిచేస్తారని జీవోలో పేర్కొంది.

ఇదీ చదవండి: ktr appreciates traffic police: తన వాహనానికి చలానా విధించిన పోలీసులపై కేటీఆర్​ ప్రశంసలు

ABOUT THE AUTHOR

...view details