రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న తరుణంలో మహారాష్ట్ర నుంచి వచ్చే వాళ్లపై నిఘా పెంచామని మంత్రి ఈటల రాజేందర్ పేర్కొన్నారు. ఆ రాష్ట్రంలో కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయని అన్నారు. మహారాష్ట్ర నుంచి వచ్చే అన్ని మార్గాల్లో చెక్‌పోస్టుల ద్వారా నిరంతరం పర్యవేక్షిస్తున్నారని మంత్రి వెల్లడించారు.
కరోనా కట్టడికి ప్రత్యేక చెక్‌పోస్టులు: మంత్రి ఈటల - కరోనా
కరోనా వైరస్ నేపథ్యంలో రాష్ట్రవాప్తంగా ప్రత్యేక చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి పర్యవేక్షిస్తున్నారని మంత్రిఈటల రాజేందర్ తెలిపారు. మహారాష్ట్రలో కరోనా కేసులు ఎక్కువగా నమోదౌతున్నాయని, ఆ రాష్ట్రం నుంచి వచ్చే ప్రాంతాల వద్ద ప్రత్యేక చెక్‌పోస్టులతో వైద్య సిబ్బంది క్షుణ్ణంగా తనిఖీలు చేపడుతుందని మంత్రి వివరించారు.
కరోనా కట్టడికి.. ప్రత్యేక చెక్‌పోస్టులు : మంత్రి ఈటల
ధర్మాబాద్, జహీరాబాద్, సిర్పూర్ కాగజ్‌నగర్, చందాపూర్ వద్ద ప్రత్యేక చెక్‌పోస్టులు ఏర్పాటు చేశామన్నారు. ఇటీవలే ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ అమెరికా నుంచి వచ్చారని, ముందు జాగ్రత్తగా అరవింద్‌కుమార్‌కు విమానాశ్రయంలో స్క్రీనింగ్ పరీక్షలు చేయించామన్నారు.
ఇదీ చూడండి :సీఏఏకి వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం