తెలంగాణ

telangana

ETV Bharat / state

మహాశివరాత్రి: హైదరాబాద్​ నుంచి శ్రీశైలానికి ప్రత్యేక బస్సులు - mahashivaratri news

మహాశివరాత్రికి హైదరాబాద్​ నుంచి శ్రీశైలానికి వెళ్లే భక్తుల కోసం టీఎస్​ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు రంగారెడ్డి రీజినల్​ మేనేజర్​ తెలిపారు. నగరంలోని పలు ప్రాంతాల నుంచి బస్సులు అందుబాటులో ఉంటాయన్నారు.

మహాశివరాత్రి: హైదరాబాద్​ నుంచి శ్రీశైలానికి ప్రత్యేక బస్సులు
మహాశివరాత్రి: హైదరాబాద్​ నుంచి శ్రీశైలానికి ప్రత్యేక బస్సులు

By

Published : Mar 6, 2021, 8:25 PM IST

మహాశివరాత్రి సందర్భంగా హైదరాబాద్ నుంచి శ్రీశైలం పుణ్యక్షేత్రానికి టీఎస్​ఆర్టీసీ 250 ప్రత్యేక బస్సులను నడుపుతుందని రంగారెడ్డి రీజినల్ మేనేజర్ వరప్రసాద్ తెలిపారు. ఈనెల 9వ తేదీ నుంచి 13వ తేదీ వరకు ఎంజీబీఎస్, జూబ్లీ బస్ స్టేషన్, దిల్​సుఖ్ నగర్, ఐఎస్ సదన్, కేపీహెచ్​బీ ప్రాంతాల నుంచి ఈ ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉన్నాయని ఆయన వెల్లడించారు. ఈనెల 9వ తేదీన 25 బస్సులు, 10వ తేదీన 90 బస్సులు, 11వ తేదీన 75 బస్సులు, 12వ తేదీన 60 బస్సులను నడుపుతున్నామని పేర్కొన్నారు.

టికెట్ల ధరలు ఇలా..

ఎంజీబీఎస్ నుంచి సూపర్ లగ్జరీ బస్సులకు రూ.510, డీలక్స్ బస్సులకు రూ.450, ఎక్స్​ప్రెస్ బస్సులకు రూ.400, నగరంలోని ఇతర ప్రదేశాల నుంచి సూపర్ లగ్జరీ బస్సులకు రూ.550, డీలక్స్ బస్సులకు రూ.480, ఎక్స్ ప్రెస్ బస్సులకు రూ.430 టికెట్ ధరగా నిర్ణయించామన్నారు.

ఇదీ చదవండి: రాష్ట్ర సర్కారుకు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ కార్యదర్శి అభినందనలు

ABOUT THE AUTHOR

...view details