సంక్రాంతి రద్దీ దృష్ట్యా ఏపీలో ప్రత్యేక బస్సులు నడపడానికి ఏర్పాట్లు చేసినట్లు ఆర్ఎం దానం తెలిపారు. జనవరి 7వ తేదీ నుంచి 19వ తేదీ వరకు జిల్లాలోని అన్ని డిపోల పరిధిలో వెయ్యి బస్సులు నడుపుతామని తెలిపారు. విశాఖ నుంచి హైదరాబాద్కు 109, చెన్నై- 3, విజయవాడ- 250, అమలాపురం, నర్సాపురం, భీమవరం- 13, రాజమహేంద్రవరం-200 , కాకినాడ- 85, నర్సీపట్నం డిపో నుంచి ప్రత్యేకంగా విజయవాడకు 15 బస్సులు నడపనున్నారు.
సంక్రాంతికి ఏపీ ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులు - విశాఖ జిల్లా తాజా వార్తలు
సంక్రాంతి పండగ సందర్భంగా ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా ప్రత్యేక సర్వీసులు నడపనున్నట్లు ఏపీ ఆర్టీసీ అధికారులు వెల్లడించారు. విశాఖ నుంచి ఇతర ప్రాంతాలకు వెయ్యి బస్సులు నడుపుతామని ఆర్ఎం దానం తెలిపారు.
![సంక్రాంతికి ఏపీ ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులు special-buses-for-sankranthi-in-visakhapatnam in ap](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9974538-154-9974538-1608693555408.jpg)
సంక్రాంతికి ఏపీ ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులు
విజయనగరం, రాజాం, పాలకొండ, పార్వతీపురం, శ్రీకాకుళం, సోంపేట, ఇచ్ఛాపురం ప్రాంతాలకు 325 బస్సులు నడుపుతామని ఏపీ ఆర్టీసీ అధికారులు వెల్లడించారు.
ఇదీ చదవండి:ఇక రోజూ 5 వేల మందికి శబరిమల దర్శనం