తెలంగాణ

telangana

ETV Bharat / state

పురుషుల కోసం టీఎస్​ఆర్టీసీ స్పెషల్ బస్సులు- సీనియర్ సిటిజన్లకే తొలి ప్రాధాన్యం - తెలంగాణ ఉచిత బస్సు ప్రయాణ పథకం

Special Buses for Men in Telangana : మహాలక్ష్మి పథకంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఫ్రీ జర్నీ సౌకర్యం కల్పిస్తోంది. ఈనెల 9 నుంచి ఈ పథకం అమల్లోకి రాగా, మహిళలు, బాలికలు, ట్రాన్స్‌జెండర్లకు రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడి నుంచి ఎక్కిడికైనా ఫ్రీగా ప్రయాణించొచ్చని చెప్పింది. ఎన్నడూ లేని విధంగా బస్సుల్లో అనుహ్యంగా రద్దీ పెరిగింది. దాదాపు 30 లక్షలు మంది ప్రయాణం చేస్తున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఈ మేరకు బస్సుల్లో పురుషులకు కేటాయించిన సీట్లలోనూ మహిళాలే కూర్చుంటున్నారు. దీంతో పలువురు పరుషులు తమకు ప్రత్యేక బస్సులు నడపాలని, లేదంటే అదనపు సర్వీసులైనా నడపాలని కోరుతున్నారు. ఈ క్రమంలోనే తెలంగాణ ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకునే యోచనలో ఉన్నట్లు తెలిసింది.

TSRTC Special Buses for Men in Telangana
TSRTC Special Buses for Men

By ETV Bharat Telangana Team

Published : Dec 27, 2023, 10:22 AM IST

Special Buses for Men in Telangana : మహిళలకు ఉచిత ప్రయాణం అమల్లోకి వచ్చాక టీఎస్​ఆర్టీసీ బస్సుల్లో రద్దీ గణనీయంగా పెరిగింది. కొన్ని బస్సుల్లో అయితే వెనక వరుస సీట్లలో కూడా వారే కనిపిస్తున్నారు. దీంతో సీటు దొరకలేదని పురుషులు దిగి వెళ్లిపోతున్నట్లు ఇటీవల నిర్వహించిన ఆన్‌లైన్‌ మీటింగ్‌లో కండక్టర్లు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ దృష్టికి తీసుకువచ్చారు.

TSRTC Men Special Buses in Telangana :ఈ క్రమంలో అవసరమైన రూట్లు, సమయాల్లో పురుషుల కోసం ప్రత్యేక బస్సులు నడిపే విషయంపై టీఎస్​ఆర్టీసీ(TSRTC) యోచిస్తోంది. వృద్ధులకు ప్రత్యేకంగా సీట్ల కేటాయింపుపైనా కసరత్తు జరుగుతోంది. మరోవైపు విద్యార్థులకు సైతం కొన్ని మార్గాల్లో బస్సులు నడిపే విషయాన్ని ఉన్నతాధికారులు చర్చిస్తున్నారు. సీనియర్‌ సిటిజన్లకు ప్రత్యేక సీట్లలో తొలి ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు సమాచారం.

20 శాతం పెరిగిన ఓఆర్‌ :ఆర్టీసీ బస్సుల్లో సీట్ల భర్తీ నిష్పత్తిని తెలిపే ఓఆర్‌(Occupancy Ratio) గతంలో 69 శాతం ఉండేది. గతంలో నిత్యం మహిళా ప్రయాణికులు 12-14 లక్షలు ఉండగా, ఇప్పుడు రాష్ట్రంలో 29 లక్షలు దాటుతున్నట్లు ఆర్టీసీ గణాంకాలు చెబుతున్నాయి. ఈ క్రమంలో ఓఆర్‌ దాదాపు 89 శాతం నమోదవుతోంది. ఉన్న వాహనాలతోనే అంత రద్దీని తట్టుకోవడం ఆర్టీసీకి సవాలుగా మారుతోంది.

ఉచిత ప్రయాణం ఆనందం అంటున్న మహిళలు - నష్టపోతున్నామంటూ ఆటోడ్రైవర్ల ఆవేదన

Separate Seats For Men in TSRTC Buses : పట్టణాల నుంచి గ్రామాలకు వెళ్లే ఆఖరి బస్సుల్లో రద్దీ మరీ ఎక్కువగా ఉంటోంది. ఈ నేపథ్యంలో పరిస్థితుల్ని డ్రైవర్‌, కండక్టర్లు దాదాపు 20 మందికి పైగా ఎండీ సజ్జనార్​కి వివరించారు. దీనిపై సమస్య పరిష్కారానికి సూచనలూ ఇచ్చారు. నిల్చొనేందుకు స్థలం లేక బస్సు ఎక్కలేక విద్యార్థులు అక్కడే ఆగిపోయి ఇబ్బందిపడ్డ ఘటనలూ ఉన్నతాధికారుల దృష్టికి చాలానే వచ్చాయి. కాగా ఉన్నతాధికారులు ఆయా అంశాలపై దృష్టి పెట్టారు. డిపో మేనేజర్లు సైతం క్షేత్రస్థాయి పరిస్థితిని వివరించారు.

'భద్రాచలం-ఖమ్మం ఎక్స్‌ప్రెస్‌లో మహిళా ప్రయాణికులు ఎక్కువగా ఉంటున్నారు. ఎడమ వరుస(ఇద్దరు కూర్చునే సీట్లు) పురుష ప్రయాణికులకు వదలండి. కుడి వరుస(ముగ్గురు కూర్చునే సీట్లు)లో మహిళలు కూర్చోండి అని చెబుతున్నాం. మహిళా ప్రయాణికులు దానిని అర్థం చేసుకుని ఒక వరుసకే పరిమితమవుతున్నారు. సీట్లు దొరకని వాళ్లు నిల్చుంటున్నారు.' అని కండక్టర్‌ కవిత పేర్కొన్నారు.

పురుషులు, విద్యార్థులు లేదా మహిళలకు ప్రత్యేకం :సమయాల వారీగా రద్దీపై సమగ్ర సమాచారం వచ్చాక విద్యార్థులకు, పురుషులకు ప్రత్యేక బస్సులు నడపడంపై ఉన్నతాధికారులు ఆలోచన చేయనున్నారు. ఇవి సాధ్యం కాదంటే మహిళలకు మాత్రమే ప్రత్యేక బస్సులు నడపడం, ఇలా రకరకాల చర్చలు జరుగుతున్నాయని తెలంగాణ ఆర్టీసీ వర్గాల సమాచారం. జీరో టికెట్‌ అని మహిళా ప్రయాణికుల్ని చిన్నచూపు చూడమని, వారి తరఫున ప్రభుత్వం ఆ ఛార్జీ చెల్లిస్తోందని ఓ ఉన్నతాధికారి పేర్కొన్నారు. ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా పలురకాల ప్రత్యామ్నాయాలపై దృష్టి పెట్టామని ఆయన తెలిపారు.

మహాలక్ష్మి పథకానికి ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో అనూహ్య స్పందన - వారం రోజుల్లోనే 11 లక్షల మంది ఉచిత ప్రయాణం

నేటి నుంచి మహాలక్ష్ములకు జీరో టికెట్ - ఆ గుర్తింపు కార్డు తప్పనిసరి

ABOUT THE AUTHOR

...view details