హైదరాబాద్‌లో ఈ ఏడాది సదర్ ఉత్సవాలను ఎలాంటి ఆడంబరం లేకుండా నిర్వహిస్తున్నారు. కరోనా వల్ల భారీ ఎత్తున ఊరేగింపు చేపట్టే కార్యక్రమాలను రద్దు చేశారు. అయితే ఈ వేడుకల్లో ముషీరాబాద్‌కు చెందిన అఖిల భారత యాదవ సంఘం రాష్ట్రనాయకుడు ఎడ్ల హరిబాబు దున్నరాజు ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది.
సదర్ ఉత్సవాల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్న హర్యానా బుల్ - హైదరాబాద్ నగర వార్తలు
దీపావళి పండుగ వచ్చిందంటే చాలు మరో వేడుక మనకు కనులవిందు చేస్తుంది. అందంగా ముస్తాబైన దున్నరాజులను ప్రదర్శించే సదర్ ఉత్సవాలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. కరోనా వల్ల నిరాడంబరంగా నిర్వహిస్తున్న ఈ వేడుకల్లో హర్యానా నుంచి తీసుకువచ్చిన దున్నరాజు ప్రత్యేకతను సంతరించుకుంది.
సదర్ ఉత్సవాల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్న హర్యానా బుల్
హర్యానాలో 25 సార్లు ఛాంపియన్‌గా నిలిచిన దున్నరాజు నగరంలో జరిగే సదర్ ఉత్సవాలలో ప్రదర్శించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. దీని బరువు 1500 కేజీలు ఉంటుందని, ప్రతిరోజు 20 లీటర్లపాలు, ఎండుఫలాలు, ఆపిల్స్ ఆహారంగా ఇస్తామని వారు వెల్లడించారు. కరోనా నిబంధనలు పాటిస్తూ ముషీరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఊరేగింపు నిర్వహించనున్నట్లు యాదవ సంఘం రాష్ట్రనాయకుడు వరుణ్ యాదవ్ పేర్కొన్నారు.