ఏపీ రాష్ట్ర ప్రభుత్వం 2021-22 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ నుంచి పిల్లల కోసం కేటాయింపులను ప్రత్యేకంగా ఒక నివేదిక రూపంలో సమర్పించనుంది. ఈ మేరకు గతంలోనే నిర్ణయం తీసుకుని అన్ని శాఖల నుంచి ఇదే తరహాలో ప్రతిపాదనలను స్వీకరించింది. 18 ఏళ్లలోపు పిల్లలపై వివిధ పథకాల ద్వారా రాష్ట్రం ఎంత వెచ్చిస్తుందో విడిగా లెక్కలు కట్టి తాజా బడ్జెట్‌లో ప్రత్యేకంగా నివేదించనుంది.
ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి గురువారం 2021-22 బడ్జెట్‌ను శాసనసభకు సమర్పించనున్నారు. కొవిడ్ కారణంగా ఇప్పటికే 3 నెలల కాలానికి ఓటాన్ అకౌంట్‌ను ఆర్డినెన్సు రూపంలో ఆమోదించారు. దీనికి సభ ఆమోదం పొందాల్సి ఉంటుంది. మొత్తం 12 నెలలకు బడ్జెట్ ప్రతిపాదిస్తూ 9 నెలల కాలానికి ఆమోదం తీసుకుంటారు.