కరోనా లక్షణాలు కనిపించిన వారు పరీక్ష చేయించుకోవాలి: సభాపతి పోచారం - హైదరాబాద్ వార్తలు
18:15 October 11
అసెంబ్లీ సమావేశాల నిర్వహణ, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సమీక్ష
అసెంబ్లీ సమావేశాల ఏర్పాట్లపై మండలి ఛైర్మన్, శాసన సభాపతి సమీక్షించారు. ఈ నెల 13, 14 తేదీల్లో శాసన సభ, శాసన మండలి సమావేశాల నేపథ్యంలో కరోనా జాగ్రత్తలు పాటించాలని శాసన సభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, శాసన మండలి గుత్తా సుఖేందర్ రెడ్డి తెలిపారు.
ఉభయ సభల ప్రాంగాణాల్లో కరోనా పరీక్షల కేంద్రాలను ఏర్పాటు చేయాలని శాసన మండలి కార్యదర్శిని ఆదేశించారు. సమావేశాలకు హాజరయ్యే సభ్యులు, శాసన సభ, పోలీసు సిబ్బంది, మీడియా ప్రతినిధులు అనుమానంగా ఉన్నా.. లేకున్నా కొవిడ్ పరీక్షలు చేయించుకోవాలని వెల్లడించారు. సోమవారం మధ్యాహ్నం 2 గంటల నుంచి కరోనా పరీక్ష కేంద్రాలు పనిచేస్తాయని పేర్కొన్నారు.
ఇదీ చూడండి:'అప్పుడు మీరు చేస్తే ఒప్పు... ఇప్పుడు మేము చేస్తే తప్పా?'