రేపటి నుంచి రెండు రోజులపాటు జరిగే అసెంబ్లీ, మండలి ప్రత్యేక సమావేశాల సందర్భంగా భద్రతా ఏర్పాట్లపై పోలీస్ అధికారులతో స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. శాసనసభ నిర్వహణకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా తగినంత మంది సిబ్బందిని నియమించాలని స్పీకర్ సూచించారు. ఈ సందర్భంగా శాఖపరంగా తీసుకుంటున్న చర్యల గురించి పోలీసు అధికారులు స్పీకర్‌కు వివరించారు. ఇవాళ సాయంత్రం శాసనసభలోని స్పీకర్ ఛాంబర్‌లో జరిగిన ఈ సమీక్ష సమావేశంలో శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్ నేతి విద్యాసాగర్, శాసనసభ ఉపసభాపతి పద్మారావు గౌడ్, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, శాసనసభ కార్యదర్శి డా. నరసింహా చార్యులు, హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ రాజీవ్ త్రివేది, డీజీపీ మహేందర్ రెడ్డి, నగర పోలీసు కమిషనర్ అంజనీ కుమార్ ఇతర అధికారులు పాల్గొన్నారు. శాంతిభద్రతల పరిరక్షణతో పాటు శాసనసభ పరిసరాలలో వాహనదారులకు, సామాన్య ప్రజలకు ఇబ్బందులు కలగకుండా తగు ఏర్పాట్లు చేయాలని స్పీకర్ పోలీసు శాఖకు సూచించారు.
'అసెంబ్లీ భద్రతపై పోలీసులతో స్పీకర్ సమావేశం' - 2019
రేపటి నుంచి రెండు రోజులపాటు జరిగే శాసనసభ, శాసనమండలి ప్రత్యేక సమావేశాలకు భద్రతా ఏర్పాట్లపై పోలీసు అధికారులతో శాసనసభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఏర్పాట్లపై చర్చించారు.

assembly
'అసెంబ్లీ భద్రతపై పోలీసు అధికారులతో స్పీకర్ సమావేశం'
ఇవీ చూడండి:'దసరా నాటికి కార్యాలయాలకు కొబ్బరికాయ కొడదాం'