తెలంగాణ

telangana

ETV Bharat / state

అసెంబ్లీ సమావేశాల ఏర్పాట్లు పరిశీలించిన స్పీకర్‌ పోచారం - తెలంగాణ వార్తలు

ఈ నెల 15 నుంచి రాష్ట్ర వార్షిక బడ్జెట్ సమావేశాలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాల ఏర్పాట్లను స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి పరిశీలించారు. కొవిడ్‌ మార్గదర్శకాలకు అనుగుణంగా సీట్ల మధ్య దూరం పెంచాలని అధికారులను ఆదేశించారు.

speaker-pocharam-srinivas-reddy-review-on-arrangements-for-assembly-meetings-in-hyderabad
అసెంబ్లీ సమావేశాల ఏర్పాట్లు పరిశీలించిన స్పీకర్‌ పోచారం

By

Published : Mar 10, 2021, 1:47 PM IST

ఈ నెల 15 నుంచి ప్రారంభం కానున్న బడ్జెట్ సమావేశాలపై శాసన సభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డి దృష్టిసారించారు. అసెంబ్లీ సమావేశాలకు సంబంధించిన ఏర్పాట్లను స్పీకర్‌ పరిశీలించారు. కొవిడ్‌ మార్గదర్శకాలకు అనుగుణంగా సీట్ల మధ్య దూరం ఉండాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్ర వార్షిక బడ్జెట్‌ ఆమోదానికి శాసనసభ, శాసనమండలిని సమావేశపరుస్తూ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ నోటిఫికేషన్ జారీ చేశారు. ఉభయసభల సభ్యులను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగిస్తారు.

పదిరోజుల పాటు సమావేశాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ, ప్రభుత్వ సమాధానం 17న ఉండే అవకాశం ఉంది. 2021-22 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర వార్షిక బడ్జెట్‌ను ఈ నెల 18న ప్రభుత్వం ఉభయసభల్లో ప్రవేశపెట్టే అవకాశం ఉంది.

ఇదీ చదవండి:'వచ్చే నెల నుంచి ఎస్సీ, ఎస్టీ, బీసీ నిరుద్యోగులకు కొత్త పథకం'

ABOUT THE AUTHOR

...view details