కుటుంబ కష్టాలతో పాటు అనారోగ్య సమస్యలతో సతమతమౌతున్న ఓ దివ్యాంగునికి శాసనసభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి తోడ్పాటునందించారు. నాగర్‌కర్నూల్ జిల్లాకు చెందిన నరేష్ 90 శాతం అంగవైకల్యంతో పాటు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు. తండ్రి చనిపోవడం వల్ల తల్లితో పాటు బతుకుదెరువు కోసం హైదరాబాద్‌కు వచ్చి పాతబస్తీలోని కుమ్మరిగూడలో అద్దె ఇంటిలో నివాసం ఉంటున్నారు.
దివ్యాంగునికి శాసనసభాపతి పోచారం చేయూత
అంగవైకల్యంతో పాటు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఓ దివ్యాంగునికి శాసనసభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి తోడ్పాటునందించారు. వికలాంగుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 100 శాతం సబ్సిడీపై సమకూర్చిన బ్యాటరీ ట్రై సైకిల్‌ను అందించారు.
దివ్యాంగునికి శాసనసభాపతి పోచారం చేయూత
తల్లి రోజూ వారి కూలీగా పనిచేస్తుంది. తన సమస్యలను సభాపతికి ఫోన్ ద్వారా తెలియజేశారు. హైదరాబాద్ జిల్లా కలెక్టర్ శ్వేతా మహంతితో మాట్లాడిన ఆయన... డబుల్ బెడ్ రూం ఇంటిని కేటాయించాలని కోరారు. ఇవాళ ఆయన నివాసంలో... హైదరాబాద్ జిల్లా వికలాంగుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 100 శాతం సబ్సిడీపై సమకూర్చిన బ్యాటరీ ట్రై సైకిల్‌ను నరేష్‌కు అందించారు.
ఇదీ చదవండి: ఈటీవీ భారత్ కథనానికి స్పందన.. బాధితుడికి అండగా నిలిచిన దాతలు