తెలంగాణ

telangana

ETV Bharat / state

కరెంటు బిల్లు ఎక్కువ వచ్చిందా.. అయితే ఏం చేయాలంటే..

కరోనా వైరస్​ నేపథ్యంలో విధించిన లాక్​డౌన్​ వల్ల... మూడు నెలల తర్వాత తీస్తున్న బిల్లులు వినియోగదారులను విస్మయానికి గురి చేస్తున్నాయి.

By

Published : Jun 9, 2020, 8:24 PM IST

spdcl-cmd-special-interview-with-etv-bharat
'మూడు నెలల రీడింగ్ చేసి సగటున బిల్లులు వేస్తున్నాం'

లాక్​డౌన్‌తో కరెంటు రీడింగ్‌లు నిలిచిపోవటం... 3 నెలల తర్వాత ఇంటింటికి తిరిగి తీస్తున్న బిల్లులు వినియోగదారులను షాక్‌కు గురిచేస్తున్నాయి. ఒకేసారి బిల్లులు తీయటం వల్ల స్లాబులు మారి... భారీగా పెరిగిపోతున్నాయని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మూడు నెలల బిల్లులు ఒకేసారి ఇవ్వడం వల్ల స్లాబులు మారుతాయా? వినియోగదారులు విడతల వారీగా చెల్లిస్తే... ఆలస్య రుసుం వసూలు చేస్తారా? ఇలా మరెన్నో సందేహాలు నెలకొన్నాయి. వీటిని నివృత్తి చేసేందుకు ఎస్పీడీసీఎల్ సీఎండీ రఘుమారెడ్డితో ఈటీవీ భారత్ ప్రతినిధి శ్రీపతి శ్రీనివాస్‌ ముఖాముఖి.

'మూడు నెలల రీడింగ్ చేసి సగటున బిల్లులు వేస్తున్నాం'

ప్రశ్న: మూడు నెలల బిల్లులు ఒకేసారి తీయడం వల్ల స్లాబులు మారతాయని వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు నిజమేనా?

జ: అది తప్పు. మూడు నెలల బిల్లును మూడుతో భాగించి సగటున బిల్లులను తీస్తాం. మూడు నెలల బిల్లును కలిపి ఇవ్వడం వల్ల స్లాబు మారదు.

ప్రశ్న: మూడు నెలల బిల్లులో... ఒక నెల తక్కువగా, మరో నెల ఎక్కువగా కరెంటు వాడితే... ఏ స్లాబ్​ కిందకు వస్తుంది?

జ: మూడు నెలల్లో ఏ నెలలో ఎక్కువగా వాడారు. ఏ నెలలో తక్కువగా వాడారు అనేదానికి ఎటువంటి ఫ్రూవ్​ ఉండదు. మూడు నెలలను మూడుతో భాగించి చేయడం వల్ల వినియోగదారులకు లబ్ధి చేకూరుతుంది.

ప్రశ్న: కరోనా వల్ల మూడు నెలల బిల్లును ఒకేసారి కట్టాలంటే ఇబ్బంది. విడతల వారీగా కట్టే వినియోగదారులకు 1.5 వడ్డీ లేకుండా చెల్లించడానికి ఏమైనా అవకాశం ఉందా?

జ: మేము ఈఆర్సీ నిబంధనల మేరకే 1.5 వడ్డీ విధిస్తున్నాం. ఒకవేళ వినియోగదారుడు ఎవరైనా... ఈఆర్సీకి పిటిషన్​ పెట్టుకుంటే.. నిర్ణయం తీసుకునే అధికారం వారికే ఉంటుంది.

ప్రశ్న: బిల్లులపై వినియోగదారులకు ఏవైనా సందేహాలుంటే నివృతి చేసుకోవడానికి ఏర్పాట్లు చేశారా?

జ: 1912 టోల్​ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేశాము. ఏవైనా సందేహాలుంటే నివృతి చేసుకోవచ్చు. త్వరలోనే హెల్ప్​లైన్​ను ఏర్పాటు చేయబోతున్నాం.

ఇవీ చూడండి: తెలంగాణకు నాలుగు కేంద్ర బృందాలు... ఎందుకంటే?

ABOUT THE AUTHOR

...view details