తెలంగాణ

telangana

ETV Bharat / state

పరిశీలించిన తర్వాతే విద్యుత్ సరఫరా: రఘుమా రెడ్డి - ఎస్పీడీసీఎల్

ముంపు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా పునరుద్ధరణలో జాగ్రత్తలు పాటించాలని ఎస్పీడీసీఎల్ సీఎండీ జీ.రఘుమా రెడ్డి అధికారులకు సూచించారు. గ్రేటర్ హైదరాబాద్​లోని ముంపు ప్రాంతాల్లో పర్యటించారు.

spdcl cmd raghuma reddy visited Sink areas in greater hyderabad
పరిశీలించిన తర్వాతే విద్యుత్ సరఫరా: రఘుమా రెడ్డి

By

Published : Oct 16, 2020, 10:27 PM IST

ఎస్పీడీసీఎల్ సీఎండీ జి.రఘుమా రెడ్డి గ్రేటర్ హైదరాబాద్​లోని ముంపు ప్రాంతాల్లో పర్యటించారు. సరూర్​నగర్, ఆస్మాన్​గఢ్, చార్మినార్ డివిజన్లలో పర్యటించారు. సీఎండీ సింగరేణి కాలనీ, గౌతంనగర్, శారదనగర్, కమలానగర్, కోదండరామ్​నగర్, పీఅండ్​టీ కాలనీ, బార్కాస్, మైసారం, చాంద్రాయణగుట్ట, అల్​జుబైల్ కాలనీ, ఫలక్​నుమా, ఇంద్రానగర్, జమాల్​నగర్, సలాలా ప్రాంతాల్లో దాదాపు రెండు నుంచి మూడు అడుగుల నీళ్లు ఉన్నాయని చెప్పారు.

సరూర్​నగర్ డివిజన్ పరిధిలో అపార్ట్​మెంట్లు, సెల్లార్లు, కొన్ని వీధుల్లో వరద నీరు ఉండటం వల్ల 13 ట్రాన్స్​ఫార్మర్లు ఛార్జ్ చేయలేదన్నారు. చార్మినార్ డివిజన్ పరిధిలోని కాలనీల్లో వరద నీరు కారణంగా 28 ట్రాన్స్​ఫార్మర్లలో సరఫరా పునరుద్ధరించలేదని వివరించారు. నగరంలో వివిధ ప్రాంతాల్లోని అపార్ట్​మెంట్ సెల్లార్లు, వీధులు వరద ముంపులో ఉండటం వల్ల 222 ట్రాన్స్​ఫార్మర్లలో విద్యుత్ సరఫరా పునరుద్ధరించలేదని తెలిపారు.

క్షేత్ర స్థాయి అధికారులు పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే విద్యుత్ సరఫరా పునరుద్ధరించాలని ఆదేశించారు. గత మూడు రోజులుగా విద్యుత్ అధికారులు, సిబ్బంది విద్యుత్ పునరుద్ధరణకు శ్రమించారన్నారు.

ఇదీ చదవండి:ఎల్లూరు సర్జ్​పూల్​ పంప్​హౌస్​లోకి చేరిన నీరు, మునిగిన మోటార్లు

ABOUT THE AUTHOR

...view details