తెలంగాణ

telangana

ETV Bharat / state

SCR Special Trains: ఆగస్టులో వీక్లీ స్పెషల్‌ రైళ్లు: దక్షిణ మధ్య రైల్వే

SCR Special Trains: దక్షిణ మధ్య రైల్వే వివిధ ప్రాంతాలకు 30 ప్రత్యేక రైళ్లను నడిపిస్తున్నట్లు ప్రకటించింది. వచ్చే నెలలో ఈ ప్రత్యేక రైళ్లను ప్రవేశపెడుతున్నట్లు వెల్లడించింది. ప్రయాణికులు ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని రైల్వేశాఖ విజ్ఞప్తి చేసింది.

SCR Special Trains
SCR Special Trains

By

Published : Jul 19, 2022, 8:45 PM IST

SCR Special Trains: వివిధ ప్రాంతాల మధ్య ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే (ద.మ.రైల్వే) ప్రకటించింది. ప్రయాణికుల అధిక రద్దీని దృష్టిలో పెట్టుకొని వివిధ తేదీల్లో 30 వీక్లీ ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు తెలిపింది. ప్రయాణికులు ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని దక్షిణ మధ్య రైల్వే అధికారులు కోరారు.

ప్రత్యేక రైళ్ల వివరాలు..

  • హైదరాబాద్ - తిరుపతి (సోమ) -- ఆగస్టు 1, 8, 15, 22, 29 తేదీల్లో
  • తిరుపతి - హైదరాబాద్ (మంగళ) -- ఆగస్టు 2, 9, 16, 23, 30 తేదీల్లో
  • కాచిగూడ - నర్సాపూర్ (సోమ) -- ఆగస్టు 1, 8, 15, 22, 29 తేదీల్లో
  • నర్సాపూర్ - తిరుపతి (మంగళ) -- ఆగస్టు 2, 9, 16, 23, 30 తేదీల్లో
  • తిరుపతి - కాచిగూడ (బుధ) -- ఆగస్టు 3, 10, 17, 24, 31 తేదీల్లో ప్రత్యేక రైళ్లను నడపనుంది.
    దక్షిణ మధ్య రైల్వే

ABOUT THE AUTHOR

...view details