తెలంగాణ

telangana

ETV Bharat / state

రేపు దక్షిణాది జోనల్‌ కౌన్సిల్‌ సమావేశం.. హాజరుకానున్న కేంద్ర హోం మంత్రి - సదరన్​ కౌన్సిల్ వార్తలు

ఆదివారం ఏపీలోని తిరుపతిలో సదరన్ కౌన్సిల్ సమావేశం జరగనుంది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా (HOME MINISTER AMIT SHAH)తోపాటు 8 రాష్ట్రాలకు చెందిన ముఖ్యులు ఈ కార్యక్రమంలో హాజరు కానున్నారు. ఆతిథ్య రాష్ట్రంగా ఇతర.. రాష్ట్రాల నుంచి వచ్చే ముఖ్యులకు తిరుమలలో ప్రత్యేక దర్శనంతోపాటు అన్ని సౌకర్యాలనూ కల్పించాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు.

HOME MINISTER AMIT SHAH
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా

By

Published : Nov 13, 2021, 11:00 AM IST

దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులు, లెఫ్టినెంట్ గవర్నర్ ల సమావేశం కోసం తిరుపతి ముస్తాబైంది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా అధ్యక్షతన (southern zonal council meeting at Tirupati being attended by central home minister Amit shah) 29వ సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి (Southern Zonal Council Meeting) ఏపీ, తెలంగాణ, కర్ణాటక, కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి, అండమాన్ నికోబార్, లక్షద్వీప్ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన ముఖ్యమంత్రులు, లెఫ్టినెంట్ గవర్నర్​లు, ముఖ్య అధికారులు హాజరవుతారు.

ఈ సదస్సు (Southern Zonal Council Meeting)లో పాల్గొనేందుకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా నేడు ఆంధ్రప్రదేశ్​ చేరుకుంటారు. రేపు జరగనున్న ఈ సమావేశం(Southern Zonal Council Meeting)లో.. రాష్ట్రాల మధ్య సహకారం, వివాదాలు, సరిహద్దు సమస్యలు, అంతర్గత భద్రత, మౌలిక సదుపాయాల కల్పన, పరిశ్రమలు, పర్యాటక అభివృద్ధి, పెండింగ్ అంశాలు, ఆర్థికాభివృద్ధి, ఎగుమతులు, కేంద్ర రాష్ట్రాల మధ్య సహకారం వంటి సమస్యలపై చర్చించనున్నారు. మెుత్తంగా.. ఈ సమావేశం(Southern Zonal Council Meeting)లో పాల్గొంటున్న రాష్టాలకు సంబంధించిన 48 అంశాలపై చర్చ జరగనుంది.

దేశాభివృద్ధిలో రాష్ట్రాల భాగస్వామ్యం పెరిగేందుకు తీసుకోవాల్సిన చర్యలపైనా (Southern Zonal Council Meeting) కేంద్ర హోం మంత్రి సూచనలు చేయనున్నారు. బెంగుళూరులో జరిగిన 28వ సమావేశం(Southern Zonal Council Meeting)లో తీసుకున్న నిర్ణయాలపై కూడా సమీక్ష చేయనున్నారు. దేశ వ్యాప్తంగా 29 రాష్ట్రాలను 5 జోనల్ కౌన్సిళ్లుగా విభజించి ఈ సమావేశాల(Southern Zonal Council Meeting)ను నిర్వహిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details