దక్షిణ మధ్య రైల్వే... పాల సరఫరాను కూడా ప్రారంభించింది. దూద్ దురంతో ప్రత్యేక రైళ్ల ద్వారా మార్చి 26 నుంచి పాల సరఫరాను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఆంధ్రప్రదేశ్‌లోని రేణిగుంట నుంచి హజ్రత్ నిజాముద్దీన్ వరకు ఈ ప్రత్యేక రైలు పాలను సరఫరా చేస్తోంది. ప్రారంభంలో రోజు విడిచి రోజు నడిచినప్పటికీ.. డిమాండ్‌ను బట్టి జూలై 15 నుంచి రోజువారీగా ఈ ప్రత్యేక రైళ్లను నడిపిస్తున్నారు. డిసెంబర్ 17 నాటికి 5 కోట్ల లీటర్లకు పైగా పాలను సరఫరా చేసింది.
దమ రైల్వే మరో రికార్డు... 37 రోజుల్లో 5 కోట్ల లీటర్ల పాల సరఫరా - milk transport record
దక్షిణ మధ్య రైల్వే మరో రికార్డు నెలకొల్పింది. మార్చి 26 నుంచి పాల సరఫరాను ప్రారంభించిన దమ రైల్వే... కేవలం 37 రోజుల్లోనే నాలుగు కోట్ల లీటర్ల నుంచి 5 కోట్ల లీటర్ల పాలను సరఫరా చేసి రికార్డు సాధించింది.
![దమ రైల్వే మరో రికార్డు... 37 రోజుల్లో 5 కోట్ల లీటర్ల పాల సరఫరా southcebtral raiways new record in milk transport](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9917113-525-9917113-1608243398415.jpg)
రేణిగుంట నుంచి దిల్లీకి పాలను సరఫరా చేసిన ఈ రైలు... దేశ వ్యాప్తంగా పాల సరఫరాలో ప్రధాన పాత్ర పోషించింది. దీని ప్రాముఖ్యతను పరిగణలోకి తీసుకొని దక్షిణ మధ్య రైల్వే మెయిల్ ఎక్స్‌ప్రెస్ రైళ్లతో సమ ప్రాధాన్యత ఇస్తూ... రేణిగుంట, హజ్రత్ నిజాముద్దీన్ (2300 కి.మీ) మధ్య 30 గంటల్లో చేరుకునే విధంగా దూద్ దురంతో ప్రత్యేక రైలును నడిపింది. కేవలం 37 రోజుల్లోనే నాలుగు కోట్ల లీటర్ల నుంచి 5 కోట్ల లీటర్ల సరఫరాను చేయడం విశేషం. దూద్ దురంతో ప్రత్యేక రైళ్లు ఇప్పటి వరకూ... 207 ట్రిప్పుల్లో 1,256 ట్యాంకర్లతో 5 కోట్ల లీటర్ల పాలను సరఫరా చేసింది.