తెలంగాణ

telangana

ETV Bharat / state

భక్తులెవరూ దేవాలయాలకు రావొద్దు : ఇంఛార్జి డీసీపీ

బోనాల జాతర ఉత్సవాల్లో భాగంగా హైదరాబాద్​లోని లాల్​దర్వాజలోని శ్రీ మహంకాళి అమ్మవారి దేవాలయ కమిటీ సభ్యులతో దక్షిణ మండలం ఇంఛార్జి డీసీపీ గజరావు భూపాల్ సమావేశమయ్యారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ... ఉత్సవాలు జరుపుకోవాలని సూచించారు. భక్తులు ఎవరూ దేవాలయాలకు రావొద్దని... ఆలయ కమిటీ వారే బోనాలు సమర్పించాలని వివరించారు.

భక్తులెవరూ దేవాలయాలకు రావొద్దు: దక్షిణ మండలం ఇంఛార్జి డీసీపీ
భక్తులెవరూ దేవాలయాలకు రావొద్దు: దక్షిణ మండలం ఇంఛార్జి డీసీపీ

By

Published : Jul 18, 2020, 10:41 PM IST

హైదరాబాద్ పాతబస్తీలో రేపు జరగబోయే బోనాల జాతర ఉత్సవాల్లో భాగంగా లాల్​దర్వాజలోని శ్రీ మహంకాళి అమ్మవారి దేవాలయ కమిటీ సభ్యులతో దక్షిణ మండలం ఇంఛార్జి డీసీపీ గజరావు భూపాల్ సమావేశం నిర్వహించారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ... ఉత్సవాలు జరుపుకోవాలని సూచించారు. ముఖ్యంగా సోమవారం జరిగే రంగం, బలిగంప, పోతురాజుల గావు కార్యక్రమాల్లో వ్యక్తిగత దూరం పాటిస్తూ.. ఉత్సవాలు జరుపుకోవాలని కోరారు.

భక్తులు ఎవరూ దేవాలయాలకు రావొద్దని... ఆలయ కమిటీ వారే బోనాలు సమర్పించాలన్నారు. కొవిడ్ ఆంక్షలు ఉన్నందున భక్తులకు అనుమతి లేదని తెలిపారు. నాగులచింత నుంచి లాల్​దర్వాజ, ఓల్డ్ ఛత్రినాక నుంచి లాల్​దర్వాజ, గౌలిపురా- లాల్​దర్వాజ రోడ్డును మూసేస్తున్నట్లు తెలిపారు. ప్రజలు సహకరించాలని ఛత్రినాక పోలీసులు తెలిపారు.

ఇదీ చూడండి:35 ప్యాకెట్ల గంజాయి స్వాధీనం.. ఇద్దరు వ్యక్తులు అరెస్ట్

ABOUT THE AUTHOR

...view details