తెలంగాణ

telangana

ETV Bharat / state

టీకాస్​తో రైలు ప్రమాదాల నివారణ..! - టీకాస్​

రైలు ప్రమాదాలు నిరోధించే వ్యవస్థను దక్షిణ మధ్య రైల్వే గతేడాది అందుబాటులోకి తీసుకొచ్చింది. సికింద్రాబాద్​- వాడి మధ్యలో ప్రయోగాత్మకంగా అమలుచేస్తున్నారు. ఈ టీకాస్​ను పూర్తి స్థాయిలో వినియోగిస్తే ప్రమాదాలు నివారించే అవకాశముంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

టీకాస్​తో రైలు ప్రమాదాల నివారణ..!

By

Published : Nov 12, 2019, 8:10 AM IST

టీకాస్​తో రైలు ప్రమాదాల నివారణ..!
రైలు ప్రమాదాలు నిరోధించే వ్యవస్థ (టీకాస్)ను గతేడాది దక్షిణ మధ్య రైల్వే అందుబాటులోకి తీసుకొచ్చింది. సికింద్రాబాద్ -వాడి మధ్యలో వికారాబాద్, తాండూర్, లింగంపల్లి రూట్​లో ప్రయోగాత్మకంగా దీన్ని అమలుచేస్తున్నారు. టీకాస్ పనితీరులో మంచి ఫలితాలు వస్తున్నాయని రైల్వే అధికారులు పేర్కొంటున్నారు. అయితే ఇది ఇంకా ప్రయోగాల దశలోనే ఉందని ఆశాఖ అభిప్రాయపడుతుంది. ఇది పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే... రైల్వే ప్రమాదాలు నిరోధించే అవకాశముంటుందని రైల్వేశాఖ అంచనా వేస్తోంది.

దేశంలోనే తొలిసారిగా టీకాస్ వ్యవస్థ పనితీరును దక్షిణ మధ్య రైల్వే వ్యవస్థ ప్రయోగాత్మకంగా పరిశీలిస్తోంది. దీనితో సిగ్నల్ అంశాలను బోర్డు మీద కనిపించేలా చేస్తుంది. పూర్తిస్థాయి, తాత్కాలిక వేగాన్ని అదుపులో ఉంచేలా దోహదపడుతుంది. రైలు సిగ్నల్ పాసింగ్​ను ముందస్తుగా తెలుసుకునే వ్యవస్థ అందుబాటులోకి వస్తుంది. ఇంత అధునాతనమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని రైల్వే శాఖ వద్ద ఉంచుకుని పూర్తిస్థాయిలో వినియోగించుకోకపోనందున ఇలాంటి ప్రమాదం జరిగిందని రైల్వే ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. ఒకవేళ టీకాస్​ను పూర్తిస్థాయిలో వినియోగించి ఉంటే ఈ ప్రమాదం జరిగి ఉండేది కాదని ప్రయాణికులు అభిప్రాయపడుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details