100 శాతం ఇంధన అవసరాలకు సోలార్ ఫలకాలను వినియోగించడంలో దక్షిణ మధ్య రైల్వే అగ్రభాగాన నిలిచింది. 13 స్టేషన్లలో సోలార్ ఫోటో వోల్టాయిక్-ఎస్పీవీని దక్షిణ మధ్య వాడుతోంది. హైదరాబాద్ ఘట్‌కేసర్ రైల్వేస్టేషన్‌లో 10 కిలోవాట్లు, ధరూర్ స్టేషన్‌లో 5, రఘునాథ్‌పల్లి 5, మేళ్లచెరువు స్టేషన్‌లో 5కిలోవాట్ల సోలార్ ఫలకాలను ఉపయోగిస్తోంది.
సోలార్ ఫలకాల వినియోగంలో అగ్రభాగాన దక్షిణ మధ్య రైల్వే
నూరు శాతం ఇంధన అవసరాలకు సోలార్ ఫలకాలను వినియోగించడంలో దక్షిణ మధ్య రైల్వే అగ్రభాగాన నిలిచింది. 13 స్టేషన్లలో ఈ విధానాన్ని వాడుతోంది.
సోలార్ ఫలకాలు వినియోగంలో అగ్రభాగాన దక్షిణ మధ్య రైల్వే
అలాగే ఒంటిమిట్ట రైల్వే స్టేషన్‌లో 7.5 కిలోవాట్లు, కడియం 10, ద్వారపూడి 10, గోదావరి స్టేషన్‌లో 10, ధర్మాబాద్ 11.6, శివున్ గావ్ 2.2, ఉమ్రిలో 17.43, కర్ఖేలి 2.2 బోల్సా స్టేషన్‌లో 2.95 కిలోవాట్ల సోలార్ ఫలకాలు వినియోగిస్తున్నట్లు రైల్వేశాఖ తెలిపింది.
ఇవీ చూడండి:అతివేగంతో ముగ్గురు యువకులు దుర్మరణం