తెలంగాణ

telangana

ETV Bharat / state

'దూద్​ దురంతో' ఎక్స్​ప్రెస్.. 37 రోజుల్లో 5 కోట్ల లీటర్ల రవాణా - తెలంగాణ వార్తలు

దక్షిణ మధ్య రైల్వే పాల సరఫరాను కూడా ప్రారంభించింది. దూద్‌ దురంతో ప్రత్యేక రైళ్ల ద్వారా మార్చి 26 నుంచి పాల సరఫరాను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఆంధ్రప్రదేశ్‌లోని రేణిగుంట నుంచి హజ్రత్‌ నిజాముద్దీన్‌ వరకు ఈ ప్రత్యేక రైలు పాల సరఫరా చేస్తోంది.

south-central-railways-new-record-in-milk-transport
37 రోజుల్లో 5 కోట్ల లీటర్ల పాలను సరఫరా చేసిన దూద్​ దురంతో ఎక్స్​ప్రెస్

By

Published : Dec 18, 2020, 1:21 PM IST

దూద్​ దురంతో ప్రత్యేక రైళ్లు ప్రారంభంలో రోజు విడిచి రోజు నడిచినప్పటికీ.. డిమాండ్‌ దృష్ట్యా జూలై 15 నుంచి రోజువారీగా ప్రత్యేక రైళ్లను నడిపిస్తున్నారు. డిసెంబర్‌ 17 నాటికి 5 కోట్ల లీటర్లకు పైగా పాలను సరఫరా చేసింది. రేణిగుంట నుంచి న్యూదిల్లీకి పాలను సరఫరా చేసిన ఈ రైలు.. దేశ వ్యాప్తంగా పాల సరఫరాలో ప్రధాన పాత్ర పోషించింది.

దీని ప్రాముఖ్యతను పరిగణలోకి తీసుకొని దక్షిణ మధ్య రైల్వే మెయిల్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లతో సమ ప్రాధాన్యత ఇస్తూ.. రేణిగుంట, హజ్రత్‌ నిజాముద్దీన్‌ (2300 కి.మీ) మధ్య 30 గంటల్లో చేరుకునే విధంగా దూద్‌ దురంతో ప్రత్యేక రైలును నడిపింది. కేవలం 37 రోజుల్లోనే నాలుగు కోట్ల లీటర్ల నుంచి.. 5 కోట్ల లీటర్ల పాలను సరఫరాను చేయడం విశేషం.

ఇదీ చూడండి: ఇంధన పొదుపులో ద.మ.రైల్వే ప్రతిభ : జీఎం గజానన్

ABOUT THE AUTHOR

...view details