దక్షిణ మధ్య రైల్వే క్రమక్రమంగా రైళ్ల పునరుద్ధరణ చేపడుతోంది. తెలంగాణలో ఎక్కువ మంది ఉపయోగించే సిర్పూర్ కాగజ్‌నగర్- సికింద్రాబాద్ డైలీ ప్రత్యేక రైలును వచ్చే నెల ఒకటో తేదీ నుంచి నడపనున్నట్లు ప్రకటించింది. జమ్ముకశ్మీర్‌లోని జమ్ముతావీ స్టేషన్ నుంచి తిరుపతి వెళ్లే రైలును వచ్చే నెల 6 నుంచి ప్రారంభించనున్నట్లు పేర్కొంది.
ఏప్రిల్ 1 నుంచి సిర్పూర్ కాగజ్‌నగర్-సికింద్రాబాద్ ప్రత్యేక రైలు - తెలంగాణ వార్తలు
ఏప్రిల్ 1 నుంచి సిర్పూర్ కాగజ్‌నగర్-సికింద్రాబాద్ ప్రత్యేక రైలు నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. అదే విధంగా 30 ప్రత్యేక రైళ్లను మరికొన్ని రోజులు నడపనున్నట్లు వెల్లడించింది.
ఏప్రిల్ 1 నుంచి సిర్పూర్ కాగజ్ నగర్- సికింద్రాబాద్ ప్రత్యేక రైలు
అదే విధంగా 30 ప్రత్యేక రైళ్లను మరికొన్ని రోజులు నడపనున్నట్లు ప్రకటించింది. ఇందులో విశాఖపట్నం-లింగంపల్లి, కడప-విశాఖపట్నం, భువనేశ్వర్-చెన్నై, విశాఖపట్నం-హజ్రత్ నిజాముద్దీన్ తదితర రైళ్లు ఉన్నాయి.