తెలంగాణ

telangana

ETV Bharat / state

Trains Cancelled : 'దయచేసి వినండి.. రేపటి నుంచి ఈ నెల 9 వరకు ఆ రైళ్లన్నీ రద్దు' - 22 ఎంఎంటీఎస్ రైళ్లను రద్దు

South Central Railway announced cancellation of 24 trains : రైళ్ల ట్రాక్ మరమ్మతుల పనుల కారణంగా.. హైదరాబాద్, సికింద్రాబాద్ పరిధిలోని పలు రైళ్లను దక్షిణ మధ్య రైల్వే తాత్కాలికంగా రద్దు చేసింది. జులై 03 నుంచి జులై 09 వరకు 24 సాధారణ రైళ్లను, 22 ఎంఎంటీఎస్ రైళ్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ప్రయాణికుల అసౌకర్యానికి చింతిస్తున్నామని.. రైల్వేశాఖ ప్రకటన విడుదల చేసింది.

Train
Train

By

Published : Jul 2, 2023, 4:51 PM IST

South Central Railway announced cancellation of 22 Trains : హైదరాబాద్, సికింద్రాబాద్ డివిజన్ల పరిధిలో ట్రాక్ మరమ్మతు పనుల కారణంగా పలు రైళ్లను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే శాఖ ప్రకటనను విడుదల చేసింది. జులై 3 నుంచి జులై 9వ తేదీ వరకు 24 రైళ్లను.. అదేవిధంగా గ్రేటర్ హైదరాబాద్​లో నడిచే 22 ఎంఎంటీఎస్​ రైళ్లను రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు వెల్లడించారు. ఈ రైల్వే పరిధిలోని ట్రాక్ మరమ్మతు పనులను ముమ్మరంగా చేస్తుండటంతో.. ఆకస్మికంగా పలు రైళ్లను రద్దు చేస్తున్నారు.

ఈ నెల 3వ తేదీ నుంచి 9వ తేదీ వరకు హైదరాబాద్, సికింద్రాబాద్ డివిజన్ల పరిధిలో ట్రాక్ మరమ్మతుల పనులు చేపడుతున్నారు. దీనితో రైళ్ల రాకపోకలకు అంతరాయం కలుగుతుందనే కారణంతో పలు రైళ్లను రద్దు చేసినట్లు ఈ సందర్భంగా రైల్వే శాఖ ప్రకటించింది. సాధారణ రైళ్లతో పాటు ఈ తేదీల్లో గ్రేటర్ హైదరాబాద్​లో వివిధ రూట్లలో నడుస్తున్న 22 ఎంఎంటీఎస్ రైళ్లనూ రద్దు చేశారు.

22 MMTS Trains Cancelled On July 03 To July 09 : లింగంపల్లి, ఫలక్​నుమా, ఉందానగర్, రామచంద్రాపురం మధ్య నడిచే 22 ఎంఎంటీఎస్ సర్వీసులను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు అధికారికంగా వివరాలను వెల్లడించారు. కావున నగరంలోని ప్రయాణికులు, దూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. అలాగే 24 సాధారణ రైళ్లను కూడా రద్దు చేశారు.

రద్దయిన 24 సాధారణ రైళ్ల వివరాలు : కాజీపేట-డోర్నకల్, విజయవాడ-డోర్నకల్, భద్రాచలం-విజయవాడ, విజయవాడ-భద్రాచలం, సికింద్రాబాద్-వికారాబాద్, వికారాబాద్-కాచిగూడ, సికింద్రాబాద్-వరంగల్, వరంగల్-హైదరాబాద్, సిర్పూర్ టౌన్-కరీంనగర్, కరీంనగర్-నిజామాబాద్, కాజీపేట-సిర్పూర్ టౌన్, బల్లార్షా-కాజీపేట, భద్రాచలం-బల్లార్షా, సిర్పూర్ టౌన్-భద్రాచలం, కాజీపేట-బల్లార్షా, కాచిగూడ-నిజామాబాద్, నిజామాబాద్-నాందేడ్ తదితర రైళ్లను తాత్కాలికంగా రద్దు చేశారు. అలాగే వీటితో పాటు కాచిగూడ-మహబూబ్​ నగర్ మధ్య నడిచే ఎక్స్​ప్రెస్​ రైలు ఉందానగర్ వరకు.. నాందేడ్-నిజామాబాద్-పండర్పూర్ ఎక్స్​ప్రెస్ ముత్కేడ్​ వరకు మాత్రమే నడుస్తాయని రైల్వేశాఖ అధికారులు పూర్తి వివరాలను తెలిపారు.

రద్దయిన 22 ఎంఎంటీఎస్ సర్వీసులు : లింగంపల్లి-హైదరాబాద్, హైదరాబాద్-లింగంపల్లి మధ్య నడిచే 10 రైళ్లు, లింగంపల్లి-ఉందానగర్ మధ్య నడిచే 3 రైళ్లు, లింగంపల్లి-ఫలక్ నుమా మధ్య నడిచే రెండు రైళ్లును తాత్కాలికంగా రద్దు చేశారు. ఉందానగర్-లింగంపల్లి మధ్య నడిచే 4 రైళ్లను.. ఫలక్ నుమా-లింగంపల్లి మధ్య రెండు రైళ్లను, రామచంద్రాపురం-ఫలక్ నుమా మధ్య నడిచే ఒక రైలును తాత్కాలికంగా రద్దు చేసినట్లు రైల్వే శాఖ వెల్లడించింది.

ఇవీ చదవండి :

ABOUT THE AUTHOR

...view details