దక్షిణ మధ్య రైల్వే నేటి నుంచి మహారాష్ట్రలోని నాందేడ్ డివిజన్‌లో రైతుల సౌకర్యార్థం మొదటి కిసాన్ రైలును ప్రారంభించినట్లు తెలిపింది. ఉల్లిపాయల లోడ్‌తో మొదటి రైలును నాందేడ్ డివిజన్‌లోని నాగర్‌సోల్ నుంచి గౌహతి తరలిస్తున్నామన్నారు. వ్యవసాయ రంగంలో ఆదాయం బలపడాలనే భావనతో భారత ప్రభుత్వం కిసాన్ రైళ్లను ప్రారంభించిందని చెప్పారు. ఇందులో భాగంగా వ్యవసాయ రంగం మార్కెటింగ్ కోసం అవాంతరాలు లేకుండా, భద్రతతో పాటు వేగవంతంగా రవాణా సేవలను అందిస్తున్నామని తెలిపారు.
రైతులను మరింత ప్రోత్సాహించేలా ఆపరేషన్ గ్రీన్స్ టీఓపీ టూ టోటల్ కింద కిసాన్ రైలు ద్వారా రవాణా అయ్యే పండ్లు, కూరగాయలపై రవాణా ఛార్జీల్లో 50 శాతం రాయితీ ఇస్తున్నట్లు ఆహార శుద్ధి పరిశ్రమ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. అందులో భాగంగా మహారాష్ట్ర నుంచి ప్రారంభించిన మొదటి కిసాన్ రైలులో రవాణా అయిన ఉల్లిపాయలకు కూడా రవాణా ఛార్జీల్లో 50 శాతం పన్ను రాయితీ ఇచ్చామని ద.మ.రైల్వే తెలిపింది. గతంలో నాగర్‌సోల్ స్టేషన్ నుంచి గూడ్స్ రైళ్ల ద్వారా ఉల్లిపాయ లోడింగ్ రవాణా అయ్యేది. అయితే, ఈ సరుకును గూడ్స్ రైళ్ల ద్వారా రవాణా చేయాంటే రైతులు, వ్యాపారస్తులు రైలు సామర్థ్యానికి తగ్గట్టు మొత్తం లోడ్ చేయాంటే సరుకును పెద్దమొత్తంలో సేకరించాల్సి వచ్చేది.