తెలంగాణ

telangana

ETV Bharat / state

South Central Railway : ఈ వేసవి సెలవుల్లో.. దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లు - తెలంగాణ తాజా వార్తలు

South Central Railway run special trains : ఈ వేసవి సెలవులను కొత్త ప్రాంతాల్లో గడపాలనుకుంటున్నారా.. అయితే మీకో గుడ్​ న్యూస్​. దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికుల సౌకర్యార్థం పలు ప్రత్యేక రైళ్లను నడుపనున్నట్లు ప్రకటించింది. రూట్ వివరాలను, తేదీలను వెల్లడించింది.

South Central Railway
South Central Railway

By

Published : May 24, 2023, 10:37 PM IST

Updated : May 25, 2023, 1:59 PM IST

South Central Railway run special trains : సురక్షితమైన, అత్యంత చౌకైన ప్రయాణం అనగానే అందరికి గుర్తొచ్చేది రైలు ప్రయాణం. బస్​తో పోల్చుకుంటే రైలులో.. పేదవారు కూడా నామమాత్రపు ఛార్జీతో ఎక్కడికైనా ఎంచక్కా చుట్టేయచ్చు. ఇక సమ్మర్​లో చాలా మంది ఇంట్లోనే కూర్చోకుండా అలా కుటుంబంతో కలిసి జాలీగా ఎటైనా వెకేషన్​కు వెళ్లాలనుకుంటారు. ఎండలు మండిపోతున్నా.. తమకు దొరికిన ఈ హాలిడే టైమ్​ను జాలీగా ఎంజాయ్ చేయడానికే ఉపయోగిస్తారు. అలాంటి వారికోసమే దక్షిణ మధ్య రైలు తీపికబురు చెప్పింది. అందుబాటు టికెట్​ ధరలో కోనసీమ అందాలను ఆస్వాదించాలనుకుంటున్నారా.. తిరుపతి వెంకన్న దర్శనానికి వెళ్లాలనుకుంటున్నారా మీకో శుభవార్త. ఈ వేసవి సెలవుల్లో కొత్త ప్రాంతాల్లో గడపాలనుకున్న వారికి రైల్వేశాఖ తీపి కబురు అందించింది. వేసవి సెలవుల దృష్ట్యా.. ప్రయాణికుల సౌకర్యార్థం ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.

కాచిగూడ-తిరుపతి, తిరుపతి-కాచిగూడ, కాచిగూడ-కాకినాడ టౌన్, కాకినాడటౌన్-కాచిగూడ మధ్య ఈనెల 25, 26, 27, 28 తేదీల్లో ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు రైల్వే శాఖ వెల్లడించింది. ఈ సౌకర్యాన్ని ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని రైల్వేశాఖ విజ్ఞప్తి చేసింది. వీటితో పాటు వీక్లీ ప్రత్యేక రైళ్లను కూడా నడిపిస్తున్నట్లు రైల్వే శాఖ ప్రకటించింది.

సికింద్రాబాద్-అగర్తలా జూన్ 5 నుంచి జులై 31 వరకు, అగర్తాల-సికింద్రాబాద్ జూన్ 6 నుంచి ఆగస్టు 4 వరు, తిరుపతి-జాల్నా జూన్ 6 నుంచి జులై 25 వరకు, జాల్నా-చప్రా జూన్ 11 నుంచి జులై 30 వరకు, చప్రా-జాల్నా జూన్ 9 నుంచి జులై 28 వరకు, అహ్మదాబాద్-తిరుచురాపల్లి జూన్ 1 నుంచి జూన్ 29 వరకు, తిరుచురపల్లి-అహ్మదాబాద్ జూన్ 4 నుంచి జులై 2 వరకు ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లను నడిపించనున్నట్లు రైల్వే శాఖ వెల్లడించింది.

రికార్డు స్థాయి ఆదాయం..:సికింద్రాబాద్.. దక్షిణ మధ్య రైల్వే చరిత్రలోనే మొదటిసారిగా ప్రయాణికుల ఆదాయంలో 5000 కోట్ల రూపాయాల ఆదాయాన్ని ఆర్జించి ఒక ప్రధాన మైలురాయిని సాధించింది. జోన్​లో ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చడం ద్వారా 5,000.81 కోట్ల రూపాయలు ఆర్జించింది. ఇది 2019-20లో నమోదైన ఉత్తమ ఆదాయము 4,119.44 కోట్ల రూపాయల కంటే రూ.881,37 కోట్లు అధికం. ఇది గత ఆదాయం కంటే 21% ఎక్కువ. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ఎక్కువ సర్వీసులు నడపడం, వివిధ విభాగాల మధ్య సిబ్బంది సమన్వయంతో పాటు సమష్టి కృషి వలన జోన్‌లోని ప్యాసింజర్ సెగ్మెంట్‌లో ఈ కొత్త మైలురాయిని చేరుకోవడం సాధ్యమైంది.

ఇవీ చదవండి:

Last Updated : May 25, 2023, 1:59 PM IST

ABOUT THE AUTHOR

...view details