కరోనా వైరస్ కట్టడికి దక్షిణ మధ్య రైల్వే అప్రమత్తమైంది. వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు రైళ్లలోని ఏసీ కోచ్లలో ఉలన్ దుప్పట్లను ప్రయాణికుల కోరికపై సరఫరా చేయనున్నట్లు రైల్వే శాఖ ప్రకటించింది. రిజర్వేషన్ చేసుకున్న ప్రయాణికుల చరవాణీలకు ఇందుకు సంబంధించిన సంక్షిప్త సమాచారం అందజేయడం జరుగుతుందని రైల్వే అధికారులు వివరించారు. ఈ విధానం ఏప్రిల్ 15 వరకు కొనసాగుతుందని పేర్కొన్నారు. బెడ్ షీట్లు, దిండ్లు, కవర్ ల పంపిణీ మాత్రం యధావిధంగా కొనసాగుతుందని ద.మ.రైల్వే స్పష్టం చేసింది.
ఏసీ కోచ్లలో ఉష్ణోగ్రతలు 23 నుంచి 25 డిగ్రీల వరకు ఉండేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఉలన్ దుప్పట్లు అవసరం లేని ప్రయాణికులు రైల్వేతో సహకరించి తమ సొంత ఏర్పాట్లు చేసుకోవాలని ద.మ.రైల్వే విజ్ఞప్తి చేసింది.