తెలంగాణ

telangana

ETV Bharat / state

మ్యాన్​ ఆఫ్​ ది మంత్ అవార్డులను ప్రదానం చేసిన దక్షిణ మధ్య రైల్వే - దక్షిణ మధ్య రైల్వే అవార్డులు

వర్చువల్ విధానంలో మ్యాన్​ ఆఫ్ ది మంత్ అవార్డులను దక్షిణ మధ్య రైల్వే జీఎం గజానన్ మాల్యా ప్రదానం చేశారు. విధి నిర్వహణలో సమయస్ఫూర్తిగా వ్యవహరించిన 45 మందికి అవార్డులను అందించారు.

south-central-railway-presented-man-of-the-month-safety-awards
మ్యాన్​ ఆఫ్​ ది మంత్ అవార్డులను ప్రదానం చేసిన దక్షిణ మధ్య రైల్వే

By

Published : Oct 7, 2020, 12:49 PM IST

విధి నిర్వహణలో సమయస్ఫూర్తితో వ్యవహరించిన 45 మందికి... దక్షిణ మధ్య రైల్వే జీఎం గజానన్ మాల్యా.. మ్యాన్ ఆఫ్ ది మంత్ అవార్డులను ప్రదానం చేశారు. సికింద్రాబాద్ రైల్ నిలయం నుంచి వర్చువల్‌గా జరిగిన సమావేశంలో అవార్డులను అందించారు.

అవాంఛనీయ ఘటనలు జరగకుకండా సమర్థవంతంగా చర్యలు తీసుకున్నవారికి ఈ గౌరవం దక్కింది. సరకు రవాణాను పెంపొందించేందుకు నిరంతరం కృషి చేయాల్సిన అవసరముందని జీఎం పేర్కొన్నారు. ఇటీవల కాలంలో ప్రవేశపెట్టిన టారిఫ్ మినహాయింపులను వినియోగదారులకు వివరించాలని అధికారులకు తెలిపారు. కేబుల్ వైఫల్యాలు, వెల్డ్ వైఫల్యాలు, యాంత్రిక లోపాలు జరగకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. పనితీరులో కచ్చితత్వాన్ని పరోక్షంగా ప్రభావితం చేసే ట్రాక్, సిగ్నలింగ్, రోలింగ్ స్టాక్ నిర్వహణ పనులను పర్యవేక్షించాలని మాల్యా తెలిపారు.

ఇదీ చూడండి:'నాకు కళ్లు లేవు.. కానీ అమ్మ ప్రపంచాన్నే చూపించేసింది'

ABOUT THE AUTHOR

...view details