తెలంగాణ

telangana

ETV Bharat / state

3లక్షల మందిని స్వస్థలాలకు చేర్చిన ద.మ.రైల్వే - South central Railway latest news

శ్రామిక్‌ ప్రత్యేక రైళ్ల ద్వారా ఇప్పటి వరకు సుమారు మూడు లక్షల మందికిపైగా వలస కార్మికులను వారి గమ్యస్థానాలకు చేర్చినట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. 235 ప్రత్యేక రైళ్లలో వారి స్వస్థలాలకు వెళ్లినట్టు పేర్కొన్నారు.

South central railway updates
South central railway updates

By

Published : Jun 5, 2020, 9:35 PM IST

తెలంగాణ నుంచి 146 సర్వీసుల ద్వారా 1లక్ష 86 వేల మంది ప్రయాణికులు.. ఏపీ నుంచి 71 రైళ్ల ద్వారా 90 వేల మంది ప్రయాణికులు తమ స్వస్థలాలకు తరలి వెళ్లారని దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. 18 రైళ్లను మహారాష్ట్రకు నడిపించి 24 వేల మంది ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు చేర్చినట్లు చెప్పారు. రైల్వే సిబ్బంది, అధికారుల చేస్తున్న కృషిని దక్షిణ మధ్య రైల్వే జనరల్‌ మేనేజర్‌ గజానన్‌ మాల్య అభినందించారు.

ABOUT THE AUTHOR

...view details