తెలంగాణ

telangana

By

Published : Jul 21, 2023, 7:19 PM IST

ETV Bharat / state

South Central Railway Economy Meals : రైలు ప్రయాణికులకు గుడ్​న్యూస్.. ఈ స్టేషన్లలో రూ.50కే భోజనం

IRCTC Economy Meals : జనరల్​ కోచ్​ రైలు ప్రయాణికులకు శుభవార్త.. చౌకధరకే నాణ్యమైన, రుచికరమైన ఆహారాన్ని సరఫరా చేయలని దక్షిణ మధ్య రైల్వే నిర్ణయించింది. ఇందులో ఎకానమీ భోజనం కేవలం రూ.50,  స్నాక్స్ రూ.20కి అందించనున్నారు. త్వరలో హైదరాబాద్‌, గుంతకల్, రేణిగుంట, విజయవాడ రైల్వేస్టేషన్లలో కౌంటర్లను ఏర్పాటు చేయనున్నారు.

South Central Railway
South Central Railway

South Central Railway Economy Meals : రైళ్లలో జనరల్ కోచ్​ల్లో ప్రయాణించే సాధారణ ప్రయాణికులకు అందుబాటు ధరలో నాణ్యమైన, రుచికరమైన ఆహారం అందించాలని దక్షిణ మధ్య రైల్వే శాఖ నిర్ణయించింది. త్వరలో రైల్వేస్టేషన్​ ప్లాట్​ఫామ్​లపై.. చౌకధరల్లో ఆహారం, స్నాక్స్, తాగునీరు అందించే సర్వీస్ కౌంటర్లను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది.

త్వరలోనే హైదరాబాద్‌, గుంతకల్, రేణిగుంట, విజయవాడ రైల్వేస్టేషన్లలో ఈ సర్వీస్ కౌంటర్లను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. ఈ సర్వీస్‌ కౌంటర్లతో ఎకానమీ భోజనం కేవలం 50 రూపాయలకు, స్నాక్స్ 20 రూపాయలకు లభిస్తాయని తెలిపింది. తక్కువ ధరకే స్వచ్ఛమైన.. తాగు నీరు కూడా అందుబాటులోకి తీసుకురానున్నట్లు దక్షిణ మధ్య రైల్వే శాఖ తెలిపింది.

ఇందులో భోజనాన్ని రెండు కేటగిరీలుగా విభజించారు. మొదటి కేటగిరీలో 7 పూరీలతో పాటు ఆలు కూర, పచ్చడిని రూ.20కి అందిస్తారు. రెండో కేటగిరీలో అన్నం, కిచిడీ, ఛోలే-కుల్చే, ఛోలే-భటూరే, పావ్‌ భాజీ, మసాలా దోశల్లో ఒక దానిని ఎంచుకోవచ్చు. దీని ధరను రూ.50గా నిర్ణయించారు. అలాగే 200 మిల్లీలీటర్ల ప్యాకేజ్డ్‌ వాటర్‌ గ్లాసులను సైతం ఆయా కౌంటర్ల వద్ద అందుబాటులో ఉంచుతారు.

ఐఆర్​సీటీసీ కిచెన్ యూనిట్ల నుంచే ఈ ఆహార పదార్ధాలు సరఫరా అవుతాయని తెలిపింది. మొదట ప్రయోగాత్మకంగా ఆరునెలల పాటు ప్లాట్​ఫామ్స్​పై కౌంటర్లను ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. భవిష్యత్త్​లో సర్వీస్ కౌంటర్ల సంఖ్యను మరింత పెంచేందుకు ప్రయత్నిస్తామని రైల్వేశాఖ వెల్లడించింది.

ఆధ్యాత్మిక పర్యటనకు భారత్​గౌరవ్..దేశంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలైన పూరీ - కాశీ - అయోధ్యలను దర్శించుకునేందుకు దక్షిణ మధ్య రైల్వే భారత్​గౌరవ్ పేరిట ప్రత్యేక రైలు సేవలను ప్రారంభించింది. సికింద్రాబాద్‌లో ప్రారంభమయ్యే రైలు.. పూరీ, కోణార్క్‌, గయా, వారణాసి, అయోధ్య, ప్రయాగ్‌రాజ్‌ల మీదుగా తిరిగి సికింద్రాబాద్‌ వస్తుంది. ప్రయాణ మార్గంలో సికింద్రాబాద్‌, ఖాజీపేట్‌, ఖమ్మం, విజయవాడ, ఏలూరు, రాజమహేంద్రవరం, సామర్లకోట, విశాఖపట్నం, విజయనగరం తదితర ప్రాంతాల్లో ఆగుతుంది.

Bharat Gaurav Train Fares: 700 సీట్లు కలిగిన ఈ ప్రత్యేక టూరిస్టు రైలులో యాత్రకు 3 వేర్వేరు ప్యాకేజీలుగా నిర్ణయించారు. ఎకానమీ క్లాస్‌లో సింగిల్‌ షేరింగ్‌కు రూ.15వేల 300లు, డబల్‌ లేదా ట్రిపుల్‌ షేరింగ్‌కు రూ.13వేల 955 రూపాయలుగా నిర్ణయించారు. 5 ఏళ్ల నుంచి 11 ఏళ్ల పిల్లలకు రూ.13 వేల 60 వసూలు చేస్తారు. స్టాండర్డ్ క్లాస్‌లో సింగిల్‌ షేరింగ్‌కు రూ.24వేల 85, డబల్‌ లేదా ట్రిపుల్‌ షేరింగ్‌కు రూ.22వేల 510 ఛార్జ్‌ చేస్తారు. 5 ఏళ్ల నుంచి 11 ఏళ్ల పిల్లలకు రూ.21వేల 460 వసూలు చేస్తారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details