కొవిడ్ మహమ్మారి తీవ్రత క్రమంగా తగ్గుతుండడంతో జనజీవనం సాధారణ స్థితికి చేరుకుంటోంది. ఈ క్రమంలో కొద్ది రోజుల క్రితం 10 ఎంఎంటీఎస్ సర్వీసులను ప్రారంభించిన దక్షిణ మధ్య రైల్వే శాఖ తాజాగా జులై 1 నుంచి వాటికి అదనంగా మరో 45 సర్వీసులను పెంచడానికి ఏర్పాట్లు చేసింది. ఈ మేరకు బోర్డు అనుమతి మంజూరు చేసిందని అధికారులు వెల్లడించారు.
MMTS: ఎంఎంటీఎస్ సర్వీసులు పెంచిన దక్షిణ మధ్య రైల్వే - ఎంఎంటీఎస్ సర్వీసులు పెంపు
రాష్ట్రవ్యాప్తంగా కరోనా తీవ్రత తగ్గుతున్న క్రమంలో హైదరాబాద్ వాసులకు దక్షిణ మధ్యరైల్వే మరో శుభవార్త చెపింది. కొన్ని రోజుల క్రితమే 10 ఎంఎంటీఎస్ రైలు సర్వీసులను ప్రారంభించిన రైల్వే శాఖ తాజాగా జులై 1 నుంచి మరో 45 రైలు సర్వీసులను అదనంగా నడపనున్నట్లు ప్రకటించింది.
జులై 1నుంచి అదనంగా నడపనున్న 45 ఎంఎంటీఎస్ రైళ్లలో ఫలక్నుమా- లింగంపల్లి- రామచంద్రాపురం మార్గంలో 13, లింగంపల్లి- రామచంద్రాపురం-ఫలక్నుమా మార్గంలో 12, హైదరాబాద్- లింగపల్లి రూట్లో 10, లింగంపల్లి- హైదరాబాద్ మార్గంలో 10 చొప్పున సర్వీసులను నడపనున్నట్లు దక్షిణమధ్య రైల్వే అధికారులు తెలిపారు. ప్రయాణికులకు ఇబ్బందు ఎదురుకాకూడదనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు వెల్లడించారు. అయితే ఈ రైళ్లను ఏ సమయం నుంచి ఏ సమయం వరకు నడపనున్నారు అనే విషయంపై స్పష్టత రావాల్సిఉంది.
ఇదీ చదవండి: ktr on link roads: 'ట్రాఫిక్ సమస్యలు, ప్రయాణ దూరం తగ్గించడమే లక్ష్యంగా లింకురోడ్లు'