తెలంగాణ

telangana

ETV Bharat / state

MMTS Trains: గుడ్ న్యూస్.. ఎంఎంటీఎస్‌ ప్రయాణికులకు వెసులుబాటు - దక్షిణ మధ్య రైల్వే

కొవిడ్​ మహమ్మారి తగ్గుముఖం పట్టడం, రాష్ట్రంలో లాక్​డౌన్​ ఎత్తివేయడంతో నగర వాసులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న ఎంఎంటీఎస్ రైళ్లు పట్టాలెక్కనున్నాయి. దాదాపు 15 నెలల తర్వాత.. రేపటినుంచి సేవలు మళ్లీ అందుబాటులోకి రానున్నాయి. అయితే దక్షిణ మధ్య రైల్వే.. ప్రయాణికుల కోసం ఓ వెసులుబాటు కల్పించింది. గతంలో తీసుకున్న సీజనల్​ టికెట్ల గడువును పొడిగిస్తున్నట్లు ప్రకటించింది.

MMTS Trains
ఎంఎంటీఎస్‌ రైళ్లు

By

Published : Jun 22, 2021, 8:24 PM IST

హైదరాబాద్​లో రేపటి నుంచి ప్రారంభమయ్యే ఎంఎంటీఎస్‌ రైళ్లలో ప్రయాణికుల కోసం దక్షిణ మధ్య రైల్వే ఓ వెసులుబాటు కల్పించింది. గతంలో తీసుకున్న సీజనల్ టికెట్ల గడువును పొడిగిస్తున్నట్లు జనరల్‌ మేనేజర్ గజానన్ మాల్యా ప్రకటించారు. మార్చి 2020లో ఎంఎంటీఎస్‌ సర్వీసుల రద్దు కారణంగా నష్టపోయిన ప్రయాణికులు.. కాలాన్ని పునరుద్ధరించిన సమయం నుంచి సీజన్‌ల్​ టికెట్​లో మిగిలిన రోజులను పొడిగించుకునేందుకు అర్హులని వెల్లడించారు.

ప్రయాణికులకు సౌకర్యార్ధం తీసుకొచ్చిన నగదు రహిత టికెటింగ్​ వంటి సదుపాయాలను వినియోగించుకోవాలని గజానన్ మాల్యా సూచించారు. బుకింగ్‌ కౌంటర్ల వద్ద రద్దీ నివారణకు భౌతిక దూరం పాటించేలా డిజిటల్‌ విధానాన్ని వినియోగించుకోవాలన్నారు. ప్రయాణికులంతా కొవిడ్ నిబంధనలను పాటించాలని కోరారు.

ఇదీ చదవండి:మద్యం డబ్బులు ఇవ్వలేదని.. మందుబాబుని చితకబాదిన మహిళ

ABOUT THE AUTHOR

...view details