తెలంగాణ

telangana

ETV Bharat / state

mmts latest news: ఎంఎంటీఎస్ ప్రయాణికులకు గుడ్​న్యూస్ - హైదరాబాద్ తాజా వార్తలు

mmts latest news: ఎంఎంటీఎస్ ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వేశాఖ తీపికబురు అందించింది. ఫస్ట్​ క్లాస్ సింగిల్ జర్నీ ఛార్జీలను 50 శాతం తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది.

mmts
ఎంఎంటీఎస్

By

Published : May 3, 2022, 5:09 PM IST

mmts latest news: ప్రయాణికుల సౌకర్యార్థం ఎంఎంటీఎస్ సర్వీసుల ఫస్ట్ క్లాస్ సింగిల్ జర్నీ ఛార్జీలను 50శాతం మేరకు తగ్గిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. తగ్గించిన ఛార్జీలు మే5 నుంచి అమల్లోకి వస్తుందని వెల్లడించింది. సికింద్రాబాద్‌, హైదరాబాద్‌ డివిజన్లలో ఎంఎంటీఎస్ రైళ్లలో ప్రయాణించే ప్రయాణికుల సింగిల్‌ జర్నీ ఫస్ట్‌ క్లాస్‌ ఛార్జీలు తగ్గించినట్లు రైల్వేశాఖ ప్రకటించింది.

లాక్​డౌన్ అనంతరం ఎంఎంటీఎస్ సర్వీసులను పునరుద్ధరించింది. నగర శివారు ప్రాంతాల ప్రయాణికులకు ప్రయోజనం కలిగేలా సర్వీసుల సంఖ్యను క్రమంగా పెంచుతుంది. ప్రస్తుతం ఫలక్‌నుమా, సికింద్రాబాద్‌, హైదరాబాద్‌, బేగంపేట, లింగంపల్లి, తెల్లాపూర్‌, రామచంద్రాపురం మధ్య .. 29 రైల్వే స్టేషన్లను అనుసంధానం చేస్తూ 86 సర్వీసులను నడుపుతోంది.

పలు స్టేషన్లలో రద్దీ సమయాలను దృష్టిలో ఉంచుకొని ప్రయాణికుల అవసరాలు తీర్చేలా సర్వీసులు నడుపుతున్నామని తెలిపారు. జంట నగరాల్లోని శివారు ప్రాంతాల ప్రయాణికులకు వేగవంతమైన, చౌకైన రవాణా మార్గాలను అందిస్తున్నాం. ధరల తగ్గింపు వల్ల ప్రయాణికులకు మరింత ప్రయోజనం కలుగుతుందని రైల్వే అధికారులు పేర్కొన్నారు.

ప్రస్తుతం ఉన్న ఛార్జీలు.. మే 5 తర్వాత అమల్లోకి వచ్చే కొత్త ఛార్జీల వివరాలు ఇవీ.. (కి.మీల వారీగా)

ఇదీ చదవండి:MP KOMATI REDDY: రైతుల తలరాతలు మార్చేలా వరంగల్‌ డిక్లరేషన్‌: కోమటిరెడ్డి

సిమ్​కార్డు రాకెట్ గుట్టు రట్టు.. లోక్​సభ స్పీకర్​ ఓం బిర్లా పేరుతో చీటింగ్​

ABOUT THE AUTHOR

...view details