తెలంగాణ

telangana

ETV Bharat / state

రైల్వే సిబ్బందికి అదనపు పడకలు ఏర్పాటు చేయాలి: గజానన్​ మాల్యా - ఆస్పత్రులో వసతులపై జీఎం ఆరా

కొవిడ్ చికిత్స అందించేందుకు రైల్వే ఆస్పత్రుల్లో సిబ్బందికి అదనపు ఆక్సిజన్ పడకలు సిద్ధం చేయాలని దక్షిణ మధ్య రైల్వే జీఎం గజానన్​ మాల్యా సూచించారు. వర్చువల్ విధానంలో ఉన్నతాధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు.

south central railway GM Gajanan mallya
వర్చువల్ విధానంలో ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహిస్తున్న జీఎం గజానన్​ మాల్యా

By

Published : May 5, 2021, 9:47 PM IST

కరోనా బారిన పడిన రైల్వే ఉద్యోగులు, పింఛనుదారుల కోసం ఆస్పత్రుల్లో చికిత్స అందించేందుకు ఏర్పాట్లు చేయాలని దక్షిణ మధ్య రైల్వే జీఎం గజానన్​ మాల్యా ఆదేశించారు. అదనంగా ఆక్సిజన్ పడకలు సిద్ధం చేయాలని సూచించారు. వర్చువల్ విధానంలో రైల్వే మేనేజర్లు, ఉన్నతాధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు.

రైల్వే స్టేషన్ల పరిసరాలలో రైళ్లలో తరచుగా శానిటైజేషన్ చేయడంపై దృష్టి పెట్టాలని అధికారులకు వివరించారు. ముఖ్యంగా బొగ్గు, సిమెంట్, గ్రానైట్, జిప్సం, ఫ్లై యాష్ వంటి సరుకు రవాణా అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. దీని కోసం నూతన మార్గాలను అన్వేషించాలని తెలిపారు. వేసవి వాతావరణం దృష్ట్యా రైల్వే బోర్డు సూచనలను పాటించాలని ఆదేశించారు.

ఇదీ చూడండి:వీడియోకాల్​ ద్వారా ప్రమాణస్వీకారం: ఎస్​ఈసీ

ABOUT THE AUTHOR

...view details