లాక్డౌన్ కొనసాగుతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఏప్రిల్ 8 నుంచి 14 మధ్య వారం పాటు దేశంలోని పలు ప్రాంతాలకు నిత్యావసరాలను రవాణా చేసేందుకు 32 పార్సల్ రైళ్లను నడిపేందుకు నిర్ణయించినట్లు దక్షిణ మధ్య రైల్వే జీఎం గజానన్ మాల్యా పేర్కొన్నారు. ఇందులో కాకినాడ-సికింద్రాబాద్, రేణిగుంట-సికింద్రాబాద్, రేణిగుంట-నిజాముద్దీన్, హైదరాబాద్-అమృత్సర్ తదితర రైళ్లు ఉన్నాయి. కొన్ని వారాల నుంచి సరుకు సరఫరా కోసం రైళ్లు నిరంతరాయంగా నడుపుతున్నట్లు అధికారులు తెలిపారు. దక్షిణ మధ్య రైల్వే ఇప్పటికే.. 4.8 లక్షల లీటర్ల పాలను, 46 టన్నుల పండ్లను హౌరా, నిజాముద్దీన్‌కు సరఫరా చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.
'నిత్యావసరాల రవాణా కోసం 32 పార్సల్ రైళ్లు' - latest news on south central railway gm announces 32 parcel trains for essential transportation
ఏప్రిల్ 8 నుంచి వారం పాటు దేశంలోని పలు ప్రాంతాలకు నిత్యావసరాలను రవాణా చేసేందుకు 32 పార్సల్ రైళ్లను నడిపేందుకు నిర్ణయించినట్లు దక్షిణ మధ్య రైల్వే జీఎం గజానన్ మాల్యా పేర్కొన్నారు.
'నిత్యావసరాల రవాణా కోసం 32 పార్సల్ రైళ్లు'