సికింద్రాబాద్ రైల్ నిలయంలో దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ గజానన్ మాల్య అధ్యక్షతన సమీక్ష సమావేశం జరిగింది. వర్షాకాలంలో తగిన భద్రతా ప్రణాళిక రూపొందించి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని గజానన్ మాల్య అధికారులకు సూచించారు. భద్రత , సమయపాలన, సరకు రవాణా, లోడింగ్‌పై సమీక్షించారు. వానాకాలంలో రైలు పట్టాలకు హానికలిగే అవకాశం ఉన్న, సున్నితమైన ప్రదేశాలను గుర్తించి నిఘాను పటిష్టం చేయాలన్నారు.
భద్రతా ప్రణాళిక రూపొందించండి: గజానన్ మాల్య - దక్షిణ మధ్య రైల్వే వార్తలు
వర్షాకాలంలో తగిన భద్రతా ప్రణాళిక రూపొందించి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ గజానన్ మాల్య అధికారులకు సూచించారు. మంగళవారం సికింద్రాబాద్ రైల్ నిలయంలో భద్రత , సమయపాలన, సరకు రవాణా, లోడింగ్‌పై సమీక్షించారు.
భద్రతా ప్రణాళిక రూపొందించండి: గజానన్ మాల్య
రైల్వే పట్టాలు, స్వరూపం స్పష్టంగా కనిపించే విధంగా చెట్ల కొమ్మలను కత్తిరించాలని సూచించారు. అన్ని ప్రధాన, ప్రతిపాదిత వంతెనల వద్ద బజర్ సౌకర్యం గల అనిమో మీటర్లను అమర్చాలన్నారు. ఈ సమావేశంలో అదనపు జనరల్ మేనేజర్ బి.బి. సింగ్‌తోపాటు అన్ని విభాగాల జోనల్ స్థాయి అధికారులు, 6 డివిజన్ల డిఆర్ఎంలు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు.
ఇవీ చూడండి:తక్కువ ధరకే మాస్కులు... నకిలీ పత్రాలతో పక్కా ప్లాన్