తెలంగాణ

telangana

ETV Bharat / state

కొవిడ్‌ బాధితులకు ఆక్సిజన్‌ సరఫరాలో రైల్వే కీలక పాత్ర

దేశవ్యాప్తంగా అవసరమైన రాష్ట్రాలకు ఆక్సిజన్ సరఫరా చేయడంపై భారతీయ రైల్వే దృష్టిసారించింది. ఆక్సిజన్​ ఎక్స్​ప్రెస్​తో వేగంగా గమ్యస్థానాలకు సరఫరా చేస్తోంది. ద.మ రైల్వే సైతం ఇప్పటికే రెండు ఆక్సిజన్​ రైళ్లను వినియోగించి ఒడిశా నుంచి హైదరాబాద్​కు ఆక్సిజన్​ను తీసుకొస్తుంది.

Oxygen Express , Railway
కొవిడ్‌ బాధితులకు ఆక్సిజన్‌ సరఫరాలో రైల్వే కీలక పాత్ర

By

Published : May 2, 2021, 1:39 PM IST

కరోనా రెండో దశలో బాధితులకు ఆక్సిజన్ ఎక్కువగా అవసరమవుతోంది. ప్రాణవాయువు కొరత రాకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. ఆక్సిజన్‌ అవసరమైన రాష్ట్రాలకు ప్రాణవాయువు సరఫరా చేయడంలో భారతీయ రైల్వే ప్రధాన పాత్ర పోషిస్తోంది. ఆక్సిజన్‌ ఎక్స్‌ప్రెస్‌లతో ప్రాణవాయువును వేగంగా గమ్యస్థానాలకు చేరుస్తోంది.

ఒడిశా నుంచి తెలంగాణకు

దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ఇప్పటికే రెండు ఆక్సిజన్ రైళ్లు ఒడిశా నుంచి తెలంగాణకు బయల్దేరాయి. ఇప్పటి వరకు వివిధ రాష్ట్రాలకు 664 మెట్రిక్ టన్నుల ద్రవరూప ఆక్సిజన్‌ను చేరవేశామని భారతీయ రైల్వే వెల్లడించింది. మరో 126 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ మార్గమధ్యలో ఉందని వివరించింది.

రాష్ట్రానికి ఆక్సిజన్​ ఎక్స్​ప్రెస్​

రాష్ట్రానికి త్వరలోనే ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్ చేరుకోనుందని దక్షిణమధ్య రైల్వే అధికారులు వెల్లడించారు. రాష్ట్రం నుంచి ఒడిశాలోని అంగుల్‌కు రెండు ఆక్సిజన్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు వెళ్లగా... అవి తిరిగి రాష్ట్రానికి చేరనున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఎన్ని ట్యాంకర్లు కోరితే.. అన్నింటినీ సరఫరా చేసేందుకు సిద్ధంగా ఉన్నామని అధికారులు వెల్లడించారు. ఆక్సిజన్ రవాణా ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం తరపున రవాణా శాఖ, ఎక్సైజ్ శాఖ అధికారులు పర్యవేక్షిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details