తెలంగాణ

telangana

ETV Bharat / state

ఓలా, ఊబర్​ క్యాబ్​ డ్రైవర్లకు రైల్వే సంఘ్ ఆపన్నహస్తం - southern central railway employees sangh

సికింద్రాబాద్​లోని ఓలా, ఊబర్ క్యాబ్​ డ్రైవర్లకు దక్షిణ మధ్య రైల్వే ఎంప్లాయిస్​ సంఘ్​ ఆపన్న హస్తం అందించింది. లాక్​డౌన్​తో ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్న క్యాబ్​ డ్రైవర్లకు నిత్యావసర సరుకులు పంపిణీ చేసింది.

railway employees sangh helped  ola and uber drivers
ఓలా, ఊబర్​ క్యాబ్​ డ్రైవర్లకు సరుకులు

By

Published : Apr 30, 2020, 2:43 PM IST

లాక్​డౌన్​తో ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్న అసంఘటిత కార్మికులను ఆదుకున్న దక్షిణ మధ్య రైల్వే ఎంప్లాయిస్​ సంఘ్​ ఇప్పుడు సికింద్రాబాద్​లోని ఓలా, ఊబర్ క్యాబ్​ డ్రైవర్లకు ఆపన్న హస్తం అందించింది. చిలకలగూడ రైల్వే ఆఫీస్​లో నిత్యావసర సరుకులు పంపిణీ చేసింది.

ఓలా, ఊబర్ జాతీయ సంఘాల ప్రధాన కార్యదర్శి సలాఉద్దీన్​ ఆధ్వర్యంలో దాదాపు 200 మంది డ్రైవర్లను గుర్తించి వారికి పదిరోజులకు సరిపడా సరుకులు అందించినట్లు రైల్వే ఎంప్లాయిస్​ సంఘ్​ నాయకులు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details