కరోనా నివారణ కోసం ప్రభుత్వం అమలు చేసిన లాక్డౌన్ వల్ల ప్రజలకు ఇంట్లోంచి బయటకు వెళ్లే అవకాశం లేదు. ఆసుపత్రిలో పరీక్షలు చేయించుకునే వారు సైతం అనేక ఇబ్బందులు పడుతున్నారు. వీటిని దృష్టిలో పెట్టుకుని దక్షిణ మధ్య రైల్వే తమ ఉద్యోగులకు ఇళ్ల వద్దకే మందులను సరఫరా చేయాలని నిర్ణయించింది. ద.మ.రైల్వేలో 95వేల మంది ఉద్యోగులు, సుమారు లక్షకు పైగా పదవీ విరమణ చేసిన ఉద్యోగులు ఉన్నారు.
ఉద్యోగులకు ఇళ్ల వద్దకే ఔషధాలు అందిస్తున్న ద.మ.రైల్వే - Railway Medicine Distribution
లాక్డౌన్ కారణంగా ప్రజలకు బయటకు వెళ్లే పరిస్థితి లేదు. వైద్యశాలలకు వెళ్లడానికి సైతం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ తరుణంలో తమ ఉద్యోగులకు దక్షిణ మధ్య రైల్వే ఇళ్ల వద్దకే మందులను సరఫరా చేయాలని నిర్ణయించింది.
ఉద్యోగులకు ఇళ్లవద్దకే మందులు అందిస్తున్న దక్షిణ మధ్య రైల్వే
వీరిలో అనేక మంది వివిధ ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. వీరందరికి అవసరమైన మందులను స్థానిక ఆసుపత్రుల నుంచి సరఫరా చేయనున్నారు. పైలట్ ప్రాజెక్టుగా హైదరాబాద్ డివిజన్ లోని లాలాగూడ సెంట్రల్ రైల్వే ఆసుపత్రి, మౌలాలి, కాచిగూడలోని రైల్వే ఆరోగ్య కేంద్రాల పరిధిలో పరిశీలిస్తున్నారు. ఆ తర్వాత ద.మ.రైల్వే పరిధిలోని అన్ని ఆసుపత్రులకు విస్తరించాలని చూస్తున్నారు.