తెలంగాణ

telangana

By

Published : Mar 21, 2020, 6:47 PM IST

ETV Bharat / state

'రేపు రాత్రి 10 గంటల వరకు ఎక్స్​ప్రెస్ రైళ్లు రద్దు'

కరోనా వైరస్​ నియంత్రణలో భాగంగా ఆదివారం జనతా కర్ఫ్యూ నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే పరిధిలో చాలా వరకు సేవలను రద్దు చేసినట్లు రైల్వే సీపీఆర్వో రాకేశ్​ స్పష్టం చేశారు. ఉదయం 4 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు బయలుదేరే అన్ని ఎక్స్​ప్రెస్​ రైళ్లను నిలిపివేసినట్లు తెలిపారు.

south central railway cpro rakesh interview
'రేపు రాత్రి 10 గంటల వరకు ఎక్స్​ప్రెస్ రైళ్లు రద్దు'

కరోనా వైరస్​ నియంత్రణలో భాగంగా దక్షిణ మధ్య రైల్వే పలు చర్యలు చేపట్టింది. రైళ్ల లోపల, స్టేషన్లు, పరిసర ప్రాంతాల్లో నివారణ చర్యలు చేపడుతోంది. జనతా కర్ఫ్యూ నేపథ్యంలో ద.మ రైల్వే పరిధిలో నడిచే 250కు పైగా ప్యాసింజర్ రైళ్లను రద్దు చేసినట్లు ద.మ రైల్వే ప్రజా సంబంధాల ముఖ్యఅధికారి రాకేశ్​ తెలిపారు. 102 ఎంఎంటీఎస్​ రైళ్లలో 12 మాత్రమే నడుస్తాయని స్పష్టం చేశారు.

రేపు ఉదయం 4 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు బయలుదేరే అన్ని మెయిల్​ ఎక్స్​ప్రెస్ రైళ్లను రద్దు చేసినట్లు ప్రకటించారు. రైల్వే స్టేషన్​ ప్రాంగణంలోని వెయిటింగ్​ హాళ్లు, రిటైరింగ్ హాళ్లు, ఫుడ్​ స్టాళ్లనూ మూసివేస్తామంటున్న దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో రాకేశ్​తో మా ప్రతినిధి ముఖాముఖి...

'రేపు రాత్రి 10 గంటల వరకు ఎక్స్​ప్రెస్ రైళ్లు రద్దు'

ఇవీ చదవండి:వెలవెలబోయిన తిరుమల క్షేత్రం.. శుభ్రపరుస్తున్న సిబ్బంది

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details