పండుగల వేళ ప్రయాణించే వారు కొవిడ్-19 నిబంధనలు కచ్చితంగా పాటించాల్సిందే అని దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్ఓ రాకేష్ స్పష్టం చేశారు. ముఖానికి మాస్క్ తప్పనిసరిగా ధరించాల్సిందే అన్నారు. థర్మల్ స్రీనింగ్ నిర్వహించిన తర్వాత ప్రయాణికులకు అనుమతి ఉంటుందన్నారు. కరోనా పరీక్షలు చేసుకున్న వారు ఫలితాలు రాకుండానే రైళ్లలో ప్రయాణించేందుకు సీ.ఆర్.పీ.ఎఫ్ సిబ్బంది ఎట్టి పరిస్థితుల్లో అనుమతించరని పేర్కొన్నారు.
ప్రయాణికులు సురక్షితంగా, ప్రశాంతమైన వాతావరణంలో ప్రయాణం చేసేందుకు వీలుగా రైల్వే స్టేషన్లలో, రైళ్లలో నిత్యం శానిటైజేషన్ చేస్తామని తెలిపారు. ప్రయాణికులు కూడా రైల్వేకి సహకరించాలని సీపీఆర్ఓ విజ్ఞప్తి చేశారు. పండుగ సందర్భంగా నడిపే రైళ్ల వివరాలను సీపీఆర్ఓ వెల్లడించారు.
ప్రయాణికులు తప్ప ఇతరులను స్టేషన్లోకి అనుమతించట్లేదని అన్నారు. పార్శిల్ సేవలను మరింత బలోపేతం చేస్తున్నట్లు పేర్కొన్నారు. కోరుకున్న సమయానికి పార్శిల్ అందేలా చర్యలు తీసుకుంటున్నామని వివరించారు.
ప్రతిరోజూ నడిచే రైళ్లు :
1. సికింద్రాబాద్-తిరువనంతపురం 20వ తేదీ నుంచి 28వ తేదీ వరకు,
2. తిరువనంతపురం-సికింద్రాబాద్ 22వ తేదీ నుంచి 30వ తేదీ వరకు,
3. సికింద్రాబాద్-హబ్లీ 21వ తేదీ నుంచి వచ్చే నెల 1వ తేదీ వరకు,
4. హబ్లీ-సికింద్రాబాద్ 20వ తేదీ నుంచి 30వ తేదీ వరకు,
5. కాచీగూడ-మైసూరు 21వ తేదీ నుంచి 29వ తేదీ వరకు,
6. మైసూర్-కాచిగూడ 21వ తేదీ నుంచి 30వ తేదీ వరకు,
7. లింగంపల్లి-కాకినాడపోర్ట్ 20వ తేదీ నుంచి 30వ తేదీ వరకు,
8. కాకినాడపోర్ట్-లింగంపల్లి 20వ తేదీ నుంచి 30వ తేదీ వరకు,
9. లింగంపల్లి-తిరుపతి 20వ తేదీ నుంచి 30వ తేదీ వరకు,
10. తిరుపతి-లింగంపల్లి 20వ తేదీ నుంచి 30వ తేదీ వరకు,
11. లింగంపల్లి-నర్సాపూర్ 23వ తేదీ నుంచి 30వ తేదీ వరకు,
12. నర్సాపూర్-లింగంపల్లి 23వ తేదీ నుంచి 30వ తేదీ వరకు,
13. విజయవాడ-హబ్లీ 20వ తేదీ నుంచి 29వ తేదీ వరకు,
14. హబ్లీ-విజయవాడ 21వ తేదీ నుంచి 30వ తేదీ వరకు,
15. హైదరాబాద్-తంబారం 20వ తేదీ నుంచి 29వ తేదీ వరకు,
16. తంబారం-హైదరాబాద్ 21వ తేదీ నుంచి 30వ తేదీ వరకు,