తెలంగాణ

telangana

ETV Bharat / state

ప్రయాణికుల సంఖ్య తగ్గడం వల్ల పలు రైళ్లు రద్దు

కరోనా ప్రభావంతో రైళ్లలో పూర్తిస్థాయిలో ప్రయాణాలు కొనసాగడంలేదు. ప్రయాణికుల సంఖ్య తగ్గడం వల్ల కొన్ని రైళ్లను పాక్షికంగా... మరికొన్నింటిని పూర్తిగా రద్దు చేసినట్లు దక్షిణమధ్య రైల్వే ప్రకటించింది.

ప్రయాణీకుల సంఖ్య తగ్గడం వల్ల పలు రైళ్లను రద్దు చేసిన ద.మ.రైల్వే
ప్రయాణీకుల సంఖ్య తగ్గడం వల్ల పలు రైళ్లను రద్దు చేసిన ద.మ.రైల్వే

By

Published : Nov 11, 2020, 6:29 PM IST

Updated : Nov 11, 2020, 7:06 PM IST

సాధారణంగా రైళ్లలో ప్రయాణించే దానికన్నా...తక్కువ సంఖ్యలో ప్రయాణికులు ఉండడం వల్ల కొన్ని రైళ్లను పాక్షికంగా, మరికొన్నింటిని పూర్తిగా రద్దు చేసినట్లు ద.మ.రైల్వే ప్రకటించింది. ఈనెల 12 నుంచి 24 వరకు పలు రైళ్లు పాక్షికంగా, పూర్తిగా రద్దు చేసినట్లు వెల్లడించింది.

రద్దైన రైళ్లివే..

12న విశాఖపట్టణం-విజయవాడ, 23న హెచ్.ఎస్ నాందేడ్-పన్వేల్, 24న పన్వేల్-హెచ్.ఎస్.నాందేడ్, 15న ధర్మాబాద్-మన్మాడ్, నర్కేడ్-కాచిగూడ, 12న తిరుపతి-కొల్హాపూర్, 14న కొల్హాపూర్-తిరుపతి, కాచిగూడ-నర్కేడ్, 16న కాచిగూడ-అకోల, 17న అకోల-కాచిగూడ, 12,13 తేదీల్లో అమృత్ సర్-హెచ్.ఎస్.నాందేడ్ రైళ్లను పాక్షికంగా రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.

ఇదీ చూడండి:ధాన్యం అమ్ముకునేందుకు టోకెన్​లు.. వాటి కోసం క్యూ లైన్​లు

Last Updated : Nov 11, 2020, 7:06 PM IST

ABOUT THE AUTHOR

...view details