కరోనాపై దక్షిణ మధ్య రైల్వే అప్రమత్తమైంది. రోజుకు 10.50 లక్షల ప్రయాణికులు ద.మ. రైల్వేలో నిత్యం ప్రయాణం చేస్తుంటారు. రోజూ 745 రైళ్లు 6,400 కి.మీ పరిధిలో తిరుగుతుంటాయి. అందుకే ప్రయాణికుల సౌకర్యార్థం ద. మ. రైల్వే కరోనా నివారణ చర్యలు చేపట్టింది.
ప్రధాన స్టేషన్లలో సూచిక బోర్డులు..
జోనల్ కేంద్ర రైల్వే ఆసుపత్రితో పాటు, ఆరు డివిజన్ కేంద్రాల్లోని ఆసుపత్రుల్లో కరోనా వైరస్ అనుమానితులకు ప్రత్యేక వార్డులను కేటాయించినట్లు దక్షిణ మధ్య రైల్వే జీఎం గజానన్ మాల్యా తెలిపారు. ప్రధానమైన స్టేషన్లలో ప్రాంతీయ భాషలలో కరోనా వైరస్‌కు సంబంధించిన సమాచారం, అనౌన్స్మెంట్లు, సూచిక బోర్డుల ద్వారా ప్రచారం చేయాలని నిర్ణయించామన్నారు. జోన్, డివిజన్ రైల్వే పరిసర ప్రాంతాల్లో కరోనా అనుమానితులను పర్యవేక్షించే యంత్రాంగాన్ని వినియోగిస్తున్నామన్నారు.