తెలంగాణ

telangana

ETV Bharat / state

డుగ్గు డుగ్గు శబ్దాలతో.. హైదరాబాద్ వాసుల గూబ గుయ్‌మంటోంది

sound pollution in Hyderabad : పరిమితి మంచిన ధ్వని కాలుష్యంతో హైదరాబాద్ వాసుల గూబ గయ్‌మంటోంది. ముఖ్యంగా ఐటీ కారిడార్‌లో ఏడాది పొడవునా.. పగలు రాత్రి తేడాలేకుండా సౌండ్ మోత మోగిస్తోంది. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి నివేదిక ప్రకారం ఏ వ్యక్తి అయినా 8 గంటలపాటు 85 డెసిబుల్స్‌కి మించిన శబ్దాలు వినకుండా జాగ్రత్తలు పాటించాలి. మరి ఈ రణగొణ ధ్వనుల నుంచి ఎలా తప్పించుకోవాలంటే..?

sound pollution in Hyderabad
sound pollution in Hyderabad

By

Published : Feb 3, 2023, 9:35 AM IST

Updated : Feb 3, 2023, 10:13 AM IST

sound pollution in Hyderabad : పరిమితికి మించిన ధ్వనితో భాగ్యనగరవాసుల గూబ గుయ్‌మంటోంది. ఆసుపత్రులు, విద్యాసంస్థలు, నివాసాలున్న సున్నిత ప్రాంతాల్లోనూ ఏడాది పొడవునా మోత మోగుతోంది. ఐటీ పరిశ్రమలు, నివాస ప్రాంతాలున్న గచ్చిబౌలి, జూబ్లీహిల్స్‌ ప్రాంతాల్లో పగలు, రాత్రి తేడా లేకుండా ధ్వని కాలుష్యం మోతాదుకు మించుతోంది.

జూబ్లీహిల్స్‌, తార్నాక వంటి నివాస ప్రాంతాల్లో, అబిడ్స్‌, జేఎన్టీయూ, ప్యారడైజ్‌ వాణిజ్య ప్రాంతాల్లో, సనత్‌నగర్‌, జీడిమెట్ల, గడ్డపోతారం పారిశ్రామిక ప్రాంతాల్లో, జూపార్కు, గచ్చిబౌలి సున్నిత ప్రాంతాల్లో ధ్వని కాలుష్యాన్ని పీసీబీ నమోదు చేస్తోంది. ఏడాది పొడవునా ఐటీ కారిడార్‌లో ఇదే పరిస్థితి.

కారణాలివీ... ఐటీ కారిడార్‌లో పబ్బుల హోరు, నిర్మాణ రంగ పనులు, భారీ ట్రక్కుల వాహనాల డ్రైవర్లు నిరంతరాయంగా హారన్లు మోగిస్తున్నారు. అధిక సీసీ వాహనాలను మాడిఫై చేయించి రాత్రివేళ హల్‌చల్‌ చేస్తూ నివాస ప్రాంతాల్లో హల్‌చల్ సృష్టిస్తున్నారు. దీనివల్ల చాలా మంది రాత్రిళ్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ఇలా చేయొచ్చు..కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి నివేదిక ప్రకారం ఏ వ్యక్తి అయినా 8 గంటలపాటు 85 డెసిబుల్స్‌కి మించిన శబ్దాలు వినకుండా జాగ్రత్తలు పాటించాలి. ఈ రణగొణ ధ్వనుల నుంచి తప్పించుకోవాలంటే ప్రజలు వీలైనంత వరకు.. ఇయర్‌ ప్లగ్‌లు వాడటం, చెవిలో దూది పెట్టుకోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు.

Last Updated : Feb 3, 2023, 10:13 AM IST

ABOUT THE AUTHOR

...view details