తెలంగాణ

telangana

ETV Bharat / state

అక్రమంగా నిల్వ ఉంచిన రేషన్ బియ్యం పట్టివేత - illegal ration rice stored in meerpet

హైదరాబాద్​ నగర శివారులో రేషన్ బియ్యాన్ని అక్రమంగా నిల్వ ఉంచిన ఇంటిపై ఎస్​ఓటీ పోలీసులు దాడి చేశారు. సుమారు 106.5 క్వింటాళ్ల రేషన్ బియ్యం, 225 ఖాళీ గన్నీ సంచులను స్వాధీనం చేసుకున్నారు.

sot police caught ration rice illegally at meerpet in Hyderabad
అక్రమంగా నిల్వ ఉంచిన 106.5 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత

By

Published : Jun 8, 2020, 9:54 AM IST

హైదరాబాద్​ మీర్​పేట్​ పోలీస్​ స్టేషన్​ పరిధిలోని తిరుమలనగర్​ కాలనీలోని ఓ ఇంట్లో ఎస్​ఓటీ పోలీసులు దాడి చేశారు. ఈ దాడిలో 106.5 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని, 225 ఖాళీ గన్నీ బ్యాగులను స్వాధీనం చేసుకున్నారు. రేషన్ బియ్యాన్ని అక్రమంగా నిల్వ ఉంచిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు నిమిత్తం మీర్​పేట్​ పోలీసులకు అప్పగించారు.

రేషన్ బియ్యాన్ని అక్రమంగా నిల్వ ఉంచారన్న ముందస్తు సమాచారం మేరకు దాడి చేశామని ఎల్బీనగర్ ఎస్​ఓటీ ఇన్​స్పెక్టర్ రవికుమార్ తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details