హైదరాబాద్ బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గుట్టు చప్పుడు కాకుండా గుట్కా తయారీ కేంద్రాలు నిర్వహిస్తున్నారు. విషయం తెలుసుకున్న ఎల్బీనగర్ ఎస్ఓటి పోలీసులు దాడి చేశారు. నిషేధిత గుట్కా ప్యాకెట్లు తయారు చేయడం చట్ట విరుద్దమని హెచ్చరించారు.
గుట్కా తయారీ కేంద్రాలపై ఎస్ఓటీ దాడులు - Gutka seized in HYDERABAD six people held
బాలాపూర్ పీఎస్ పరిధిలో గుట్కా తయారీ కేంద్రాలపై ఎస్ఓటీ పోలీసులు దాడులు నిర్వహించారు. ఏకకాలంలో నాలుగు చోట్ల రైడ్ చేసి ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. రూ. 30 లక్షల విలువైన వెయ్యి గుట్కా ప్యాకెట్లతోపాటు తయారీ యంత్రాలను స్వాధీనం చేసుకున్నారు.
గుట్కా తయారీ కేంద్రాలపై ఎస్ఓటీ దాడులు
ఒకేసారి నాలుగు చోట్ల రైడ్ చేసి ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. రూ. 30 లక్షల విలువైన వెయ్యి గుట్కా ప్యాకెట్లతోపాటు తయారీ యంత్రాలను స్వాధీనం చేసుకున్నారు. దీనిపై కేసు నమోదు చేసి తదుపరి విచారణ నిమిత్తం బాలాపూర్ పోలీసులకు అప్పగించారు.
ఇదీ చూడండి:తెలంగాణలో ప్రజా రవాణాకు కసరత్తు..