తెలంగాణ

telangana

ETV Bharat / state

'సోనూ' మరో సాయం: స్వస్థలాలకు చేరిన రష్యాలోని భారత విద్యార్థులు - రష్యాలోని భారత విద్యార్థులకు సోనూసూద్ సాయం వార్తలు

సోనూసూద్.. కరోనా కష్టకాలంలో సాయానికి మారుపేరుగా నిలుస్తున్న పేరు. ఇప్పటికే ఎంతోమంది వలస కూలీలను స్వగ్రామాలకు చేర్చిన ఈ సినీనటుడు.. మరెంతో మందిని ఎన్నో విధాలుగా ఆదుకుంటున్నారు. రాష్ట్రాలు, ప్రాంతాలతో సంబంధం లేకుండా ఆపదలో ఉన్నవారికి ఆపద్బాంధవుడిగా మారుతున్న సోనూ.. తాజాగా రష్యాలో చిక్కుకున్న దేశ విద్యార్థులు స్వస్థలాలకు రావడంలో సాయపడ్డారు.

'సోనూ' మరో సాయం: స్వస్థలాలకు చేరిన రష్యాలోని భారత విద్యార్థులు
'సోనూ' మరో సాయం: స్వస్థలాలకు చేరిన రష్యాలోని భారత విద్యార్థులు

By

Published : Jul 29, 2020, 1:25 PM IST

రష్యాలో వైద్య విద్య అభ్యసిస్తున్న కొంతమంది విద్యార్థులు కరోనా కారణంగా అక్కడే చిక్కుకుపోయారు. వారిలో ఏపీ శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఏడుగురు విద్యార్థులు ఉన్నారు. వారు స్వదేశానికి వచ్చేందుకు సహాయం కోసం ట్విట్టర్ ద్వారా సోనూసూద్​ను అర్థించారు. స్పందించిన ఆయన... వారంతా భారత్​కు వచ్చేందుకు ఏర్పాట్లు చేశారు.

ఈనెల 24న వారంతా ప్రత్యేక విమానం ద్వారా స్వదేశానికి చేరుకున్నారు. తమ పిల్లలు ఇళ్లకు వచ్చేందుకు సహాయం చేసిన సోనూకు విద్యార్థుల తల్లిదండ్రులు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలిపారు.

ఇదీ చదవండి:ఏ చావైనా.. కొవిడ్​ చావుగా భావించడం సరికాదు: మంత్రి ఈటల

ABOUT THE AUTHOR

...view details