తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటుకు ముందుకొచ్చిన సోనూసూద్

అవసరం ఏదైనా.. ఎవరికైనా నేనున్నానంటూ స్పందిస్తున్న నటుడు సోనూసూద్ మరోసారి తన ఔదార్యాన్ని చాటుకున్నారు. మిత్రుడి విజ్ఞప్తి మేరకు ఆంధ్రప్రదేశ్​లోని నెల్లూరు జిల్లాలో ఆక్సిజన్‌ ప్లాంట్‌ ఏర్పాటుకు సోనూసూద్‌ ముందుకొచ్చారు. ఈ విషయాన్ని మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి ధ్రువీకరించారు.

sonu-sood-promised-to-establish-oxygen-plant-at-nellore-district
ఏపీలో ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటుకు ముందుకొచ్చిన సోనూసూద్

By

Published : May 18, 2021, 9:43 AM IST

Updated : May 18, 2021, 10:54 AM IST

సినీ నటుడు సోనూసూద్‌ మరోమారు గొప్ప మనసు చాటుకున్నారు. ఆంధ్రప్రదేశ్​లోని నెల్లూరు జిల్లాలో రూ.1.5 కోట్ల వ్యయంతో ఆక్సిజన్‌ ప్లాంట్‌ ఏర్పాటుకు హామీ ఇచ్చారు. నెల్లూరులోని జెండా వీధిలో ఉంటున్న సోనూసూద్‌ మిత్రుడు సమీర్‌ఖాన్‌ కుటుంబ సభ్యులకు ఇటీవల కరోనా మహమ్మారి సోకింది. ఆసుపత్రుల్లో ఆక్సిజన్‌ పడకలు దొరక్క వారు మృత్యువాతపడ్డారు.

ఈ నేపథ్యంలో నెల్లూరు జిల్లాలో ఆక్సిజన్‌ ప్లాంట్‌ ఏర్పాటు చేయాలని సోనూసూద్‌ను సమీర్‌ఖాన్‌ కోరారు. సోనూసూద్ ఇందుకు సానుకూలంగా స్పందించడంతో సమీర్‌ఖాన్‌ ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లారు. ఫోన్‌లో మాట్లాడించారు. ఆత్మకూరు లేదా కావలి ప్రాంతంలో ప్లాంట్‌ ఏర్పాటు చేసేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.

ఈ విషయాన్ని నెల్లూరు జిల్లాకు చెందిన మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి ధ్రువీకరించారు. జిల్లాలో 2 టన్నుల సామర్థ్యం ఉన్న ఆక్సిజన్‌ ప్లాంట్‌ ఒకటి ఏర్పాటు చేసేందుకు అవసరమైన నిధులను సోనూసూద్‌ అందిస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఈ విషయమై జిల్లా కలెక్టర్‌కు సమాచారం పంపారని.. త్వరలో దీని నిర్మాణాన్ని చేపడతామని స్పష్టం చేశారు.

ఇవీ చదవండి:'ప్రైవేటు ఆస్పత్రులను ప్రభుత్వ అధీనంలోకి తీసుకోవడంపై ఆలోచించండి'

Last Updated : May 18, 2021, 10:54 AM IST

ABOUT THE AUTHOR

...view details