ప్రముఖ ఎడ్యుకేషన్ కన్సల్టెంట్స్ ఎడ్యుటెక్.. తమ సంస్థ బ్రాండ్ అంబాసిడర్‌గా నటుడు సోనూసూద్‌ను నియమిస్తున్నట్లు ప్రకటించింది. కొవిడ్ మహమ్మారితో సుదూర ప్రాంతాల్లో చిక్కుకున్న వలస కూలీలతో పాటు.. విదేశాల్లో చిక్కుకున్న 8500 మంది భారతీయ విద్యార్థులను స్వస్థలాలకు చేరవేసేందుకు సోనూసూద్ పాటుపడ్డారని ప్రముఖ సంగీత దర్శకులు ఆర్పీ పట్నాయక్ కొనియాడారు. వైద్యవిద్య, అనుబంధ హెల్త్ కేర్ విద్య అడ్మిషన్లు, శిక్షణకు దేశవ్యాప్తంగా పేరొందిన ఐఎస్ఎం- ఎడ్యుటెక్ విస్తరణకు.. సోనూసూద్ చెరిష్మా మరింత దోహదపడుతుందని నిర్వాహకులు పేర్కొన్నారు.
ఐఎస్ఎం-ఎడ్యుటెక్ సంస్థ బ్రాండ్ అంబాసిడర్‌గా సోనూసూద్ - ఐఎస్ఎం-ఎడ్యుటెక్ సంస్థ
ఐఎస్ఎం-ఎడ్యుటెక్ సంస్థ తమ బ్రాండ్ అంబాసిడర్‌గా బాలీవుడ్ నటుడు సోనూసూద్‌ను నియమిస్తున్నట్లు ప్రకటించింది. వైద్యవిద్య, అనుబంధ హెల్త్ కేర్ విద్య అడ్మిషన్లు, శిక్షణకు దేశవ్యాప్తంగా పేరొందిన ఐఎస్ఎం- ఎడ్యుటెక్ విస్తరణకు.. సోనూసూద్ చెరిష్మా మరింత దోహదపడుతుందని నిర్వాహకులు పేర్కొన్నారు.
ఐఎస్ఎం-ఎడ్యుటెక్ సంస్థ బ్రాండ్ అంబాసిడర్‌గా సోనూసూద్
ఐఎస్ఎం-ఎడ్యుటెక్ ద్వారా ఇప్పటికే పదివేల మంది విద్యార్థులు వైద్యవిద్యను పూర్తిచేసి భారత్‌తో పాటు.. మరిన్ని దేశాల్లో వైద్యులుగా సేవలందిస్తున్నారని తెలిపారు. తమ పిల్లలను తక్కువ ఖర్చుతో వైద్యవిద్యను అభ్యసించేలా పరితపించే తల్లిదండ్రులకు ఐఎస్ఎం ఎడ్యుటెక్ ఒక మంచి ఆప్షన్ అని నిర్వాహకులు తెలిపారు.
ఇవీ చూడండి:అక్టోబర్ 5 నుంచి అంబేడ్కర్ వర్సిటీ డిగ్రీ పరీక్షలు