Sonia Gandhi Birthday Celebrations at Gandhi Bhavan :రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధీ జన్మదిన వేడుకలను కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఘనంగా నిర్వహించారు. తెలంగాణ స్వరాష్ట్ర ఆకాంక్షను నెరవేర్చిన ప్రదాత సోనియాగాంధీ అంటూ, జై కాంగ్రెస్ జై సోనియమ్మ అని నినాదాలు చేశారు. సికింద్రాబాద్ కాంగ్రెస్ నేత(Congress Leader) ఆడం సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో తుకారం గేట్లో సోనియాగాంధీ 78వ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు.
దొరల తెలంగాణను ప్రజల తెలంగాణగా మార్చుకుందాం : సోనియా గాంధీ
సోనియా గాంధీ చిత్రపటానికి పాలాభిషేకం చేసి కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. హైదరాబాద్ రాంనగర్ చౌరస్తాలో ఎఐసీసీ మత్స్య విభాగం జాతీయ కార్యదర్శి బిజ్జి శత్రు తదితరులు కేక్ కట్ చేసి సంబరాలు చేశారు.బస్సులో ప్రయాణిస్తున్న మహిళలకు ఆయన మిఠాయిలు పంచి శుభాకాంక్షలు తెలిపారు.
శేరిలింగంపల్లి నియోజకవర్గ ఇన్చార్జ్ జగదీశ్వర్ గౌడ్, వివేకానంద నగర్ డివిజన్ రిక్షా పుల్లర్ కాలనీలో సోనియమ్మ జన్మదిన వేడుకల్లో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని కేక్ కట్ చేశారు. ఉస్మానియా యూనివర్సిటీలో(Osmania University) సోనియాగాంధీ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. యూనివర్సిటీలోని మహిళా ఉద్యోగులకు చీరలు పంపిణీ చేశారు.
ఉచిత ప్రయాణంతో ఆర్థికంగా ప్రయోజనం - మహాలక్ష్మి పథకంపై మహిళల ఆనందం
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటులో కేంద్ర ప్రభుత్వం నుంచి నాటి హోం శాఖ మంత్రి చిదంబరం రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను మొదలుపెట్టారు. ఒకటి కేంద్ర ప్రభుత్వం తెలంగాణ పట్ల పరిపాలక నిర్ణయం తీసుకోవడం, రెండు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవటానికి ఎన్ని ఒడుదొడుకులు ఎదురైనా, ఎన్ని రాజకీయ ప్రకంపనలు ఎదుర్కోవాల్సి వచ్చినా అన్నిటినీ తట్టుకొని నిలబడి ఉక్కు సంకల్పంతోటి అరవై సంవత్సరాల ఆకాంక్షను కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ నెరవేర్చారు.-రేవంత్ రెడ్డి, రాష్ట్ర ముఖ్యమంత్రి