తెలంగాణ

telangana

ETV Bharat / state

తెలుగు విశ్వవిద్యాలయంలో పాటల పండుగ సత్కారం - Bapu Ramanala Songs in Telugu University, Nampally

నాంపల్లిలోని తెలుగు విశ్వవిద్యాలయంలో బాపు రమణల తెలుగు తిరుప్పావై సిరినోము పాటల పండుగ సంగీత సత్కారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ ఛైర్మన్ కేవీ రమణాచారి, సుప్రసిద్ధ సినీ గాయకులు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, సంగీత దర్శకుడు కీరవాణి, సినీ గాయకురాలు సునీత, శ్రీలేఖ తదితర ప్రముఖులు పాల్గొన్నారు.

song-festival-honors-at-telugu-university-hyderabad
తెలుగు విశ్వవిద్యాలయంలో పాటల పండుగ సత్కారం

By

Published : Dec 18, 2019, 11:54 PM IST

తెలుగు విశ్వవిద్యాలయంలో పాటల పండుగ సత్కారం
బాపు రమణల తెలుగు తిరుప్పావై సిరినోము పాటల పండుగ సంగీత సత్కారం హైదరాబాద్​లో అట్టహాసంగా జరిగింది. నాంపల్లిలోని తెలుగు విశ్వవిద్యాలయంలో శాంతా వసంతా ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా బాపు రమణ యూట్యూబ్ ఛానల్​లో పాడిన గాయకులను నిర్వాహకులు ఘనంగా సత్కరించారు.

ఈ వేడుకల్లో తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ ఛైర్మన్ కేవీ రమణాచారి, సుప్రసిద్ధ సినీ గాయకులు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, సంగీత దర్శకుడు కీరవాణి, సినీ గాయకురాలు సునీత, శ్రీలేఖ తదితర ప్రముఖులు హాజరయ్యారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details