కన్న తల్లి అయిన, తండ్రి అయిన విడదీస్తానంటోంది కరోనా మహమ్మారి. దీనికి ఉదాహరణే ఏపీ గుంటూరు జిల్లాలోని మాచర్లలో జరిగిన ఘటన. మాచర్లకు చెందిన వెంకటేశ్ అనే వ్యక్తి తన తల్లికి కరోనా ఉందని తెలిసి బస్టాండ్ వద్ద వదిలేసి వెళ్లాడు. సమాచారం అందుకున్న మాచర్ల తహసీల్దార్ వెంకయ్య, కమిషనర్ గిరి కుమార్, ఎస్సై మోహన్ ఘటన స్థలానికి చేరుకున్నారు.
కరోనా సోకిందని తల్లిని రోడ్డుపై వదిలేసిన తనయుడు - గుంటూరులో తల్లిని రోడ్డుపై వదిలేసిన కొడుకు
కరోనా మహమ్మారి రక్త సంబంధాలను విడదీస్తోంది. బంధువుల మధ్య దూరం పెంచుతోంది. తల్లి అయిన, తండ్రి అయిన విడదీస్తాను అంటోంది. కన్న తల్లికి కరోనా పాజిటివ్ ఉందని తెలుసుకున్న కుమారుడు... రోడ్డుపై వదిలేశాడు.

కరోనా సోకిందని తల్లిని రోడ్డుపై వదిలేసిన తనయుడు
భాదితురాలిని గుంటూరు ఆసుపత్రికి తరలించారు. కన్నతల్లిని రోడ్డు మీద వదిలేసి వెళ్లిన కుమారుడు వెంకటేశ్‌పై చర్యలు తీసుకోనున్నట్లు సమాచారం.
ఇద చదవండి:పాఠశాలల ప్రారంభంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు: విద్యాశాఖ